ETV Bharat / bharat

ఫోన్ గురించి గొడవ- చెల్లిని నరికి చంపిన అన్న - crime news

అధికంగా ఫోన్​ వాడుతోందని సొంత చెల్లినే చంపేశాడు ఓ అన్న. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది.

brother killed sister
సొంత చెల్లినే చంపిన అన్న
author img

By

Published : Jun 30, 2021, 4:33 PM IST

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో విషాదం జరిగింది. మొబైల్​ ఫోన్​ అధికంగా వాడుతోందని సొంత చెల్లినే హత్య చేశాడు ఆమె అన్న.

వసవప్పపురం గ్రామంలో రైతు సుదాలాల్​ నివసిస్తున్నాడు. అతనికి కుమారుడు మలైరాజ్​(20), కూతురు కవిత(17) ఉన్నారు. ఇటీవల కవిత సెల్​ఫోన్​ను అధికంగా వాడుతోంది. నిత్యం ఫేస్​బుక్​, వాట్సాప్​, వీడియో గేమ్స్​తో గడుపుతోంది. దీంతో ఆమె అన్న మలైరాజ్​కు కోపం వచ్చేది. ఫోన్​ అధికంగా వాడొద్దంటూ చెల్లిని మలైరాజ్​ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో జూన్​ 29న కవిత ఫోన్​లో గేమ్​ ఆడుతుండగా.. ఆపేయమని ఆదేశించాడు. అయినా ఆమె ఆపలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. కోపంలో కొడవలితో కవితను మలైరాజ్ చంపేశాడని పోలీసులు తెలిపారు.

kavitha
మృతురాలు కవిత

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కవిత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మలైరాజ్​ను అరెస్టు చేశారు. దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి:క్షుద్రపూజల నిందవేసి.. మలం తినిపించి...

10 కోడి గుడ్లను కక్కిన పాము- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.