దేశంలో కరోనా మృత్యు విలయం కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా.. మరణాలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించగా, దిల్లీ ప్రభుత్వం కూడా మరో వారం రోజు పొడిగించే యోచనలో ఉంది.
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఎలాంటి సడలింపులు లేకుండా మరో వారం పాటు పొడిగించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మే చివరి వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
మిజోరంలోని ఐజ్వాల్‌లో మే 31 వరకు లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. నాగాలాండ్, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో ఈ నెల చివరి వరకు కరోనా ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది.
ఇదీ చూడండి: 'దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు'