ETV Bharat / bharat

తెరుచుకున్న వైన్స్- మందుబాబులు ఫుల్ ఖుష్​ - కరోనా ఆంక్షల సడలింపు

తమిళనాడులో సోమవారం నుంచి వైన్​ షాపులు కళకళలాడుతున్నాయి. కరోనా తగ్గుముఖం పడుతోన్న వేళ అన్​లాక్​(Unlock) ప్రక్రియలో భాగంగా బెల్ట్​ షాపులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కర్ణాటక, పంజాబ్, హరియాణాల్లోనూ ఆంక్షలను సడలించారు.

Tamil Nadu unlock
తమిళనాడులో ఆంక్షల సడలింపు
author img

By

Published : Jun 14, 2021, 12:01 PM IST

Updated : Jun 14, 2021, 1:27 PM IST

తమిళనాడులోని మందు బాబులకు కిక్​ ఇచ్చే ప్రకటన చేసింది సర్కారు. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో నేటి నుంచి వైన్ షాపులు తెరుచుకోనున్నాయని తెలిపింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు అవి తెరిచి ఉంటాయి. కరోనా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో మే 10న విధించిన ఆంక్షల సడలింపులో(Unlock) భాగంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. దీంతో లిక్కర్​ కోసం ఆంధ్రాకు క్యూ కట్టిన మందుబాబులకు.. ఆ శ్రమ తప్పనుంది.

Tamil Nadu unlock
తెరుచుకున్న వైన్స్
Tamil Nadu unlock
వైన్ షాపు ముందు క్యూ

సెలూన్లు, ఆటోలు..

చెన్నై సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం. పార్కులు ఉదయం 6 నుంచి 9 వరకు తెరిచి ఉంటాయని తెలిపింది. ట్యాక్సీలు, ఆటోలు నడిచేందుకు అనుమతించింది.

Tamil Nadu unlock
సెలూన్లు ఓపెన్

దశలవారీ అన్​లాక్​ ప్రక్రియలో భాగంగా అంబాలాలో జిమ్​లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు హరియాణా సర్కారు అనుమతించింది.

Tamil Nadu unlock
తెరుచుకున్న జిమ్​లు

ఆటోలు రయ్..

కర్ణాటకలోని 19 జిల్లాల్లో కరోనా ఆంక్షలను సడలించింది రాష్ట్ర ప్రభుత్వం. ధార్వాడ్​లో ఆటోలు, క్యాబ్​లను రాత్రి 7 గంటల వరకు నడిపేందుకు అనుమతించింది. అన్ని పరిశ్రమలు 50 శాతం సిబ్బందితో పని చేయవచ్చని తెలిపింది.

Tamil Nadu unlock
రోడ్డెక్కిన ఆటోలు

దిల్లీలోనూ సోమవారం నుంచి 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. జమ్ము కశ్మీర్​లో 8 జిల్లాల్లో నిబంధనలను సడలించారు. పంజాబ్​లో సాయంత్రం 6 వరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది.

ఇదీ చూడండి: అన్​లాక్​కు గ్రీన్​ సిగ్నల్​- మాల్స్​, మార్కెట్లు ఓపెన్​

Last Updated : Jun 14, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.