తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 234 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 3,998 అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం ఆరు గంటల వరకు 65.11 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఓటేసిన ప్రముఖులు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో పాటు డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్‌సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్.. తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.





తరలిన సినీ ప్రముఖులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తి.. తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



ఇదీ చదవండి:'మే 2న టీఎంసీ కథ కంచికే!'