దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 10,448 కేసులు నమోదయ్యాయి. 434 మంది ప్రాణాలు కోల్పోయారు. 21,058 మంది డిశ్చార్జ్ అయ్యారు.
మహారాష్ట్రలో 10,107 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 270 మంది చనిపోయారు. దీంతో మొత్తం ఆ రాష్ట్రంలో కరోనా ధాటికి కన్నుమూసిన వారి సంఖ్య 1,15,390 చేరింది.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- దిల్లీలో కొత్తగా 212 కేసులు వెలుగులోకి వచ్చాయి. 25 మంది మరణించారు.
- కర్ణాటకలో 7345 కేసులు బయటపడ్డాయి. 148 మంది మృతి చెందారు.
- గుజరాత్లో 298 మందికి కరోనా నిర్ధరణ అయింది. ఐదుగురు వైరస్ ధాటికి బలయ్యారు.
- కేరళలో 13,270 కేసులు బయటపడ్డాయి. 147 మంది వైరస్ ధాటికి ప్రాణాలు విడిచారు.
- రాజస్థాన్లో కొత్తగా 280 మందికి వైరస్ సోకింది. మరో 9 మంది మరణించారు.
- ఉత్తర్ప్రదేశ్లో కొత్తగా 310 మందికి కరోనా సోకగా.. మరో 50 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
- మధ్యప్రదేశ్లో కొత్తగా 160 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 34 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: 'పిల్లల్లో కరోనా'పై కేంద్రం మార్గదర్శకాలు