Tamil Nadu Bank Robbery: తమిళనాడులో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. రూ. 20 కోట్ల విలువైన బంగారం, నగదు దోచుకెళ్లారు దుండగులు. చెన్నై అరుంబాక్కంలోని ఫెడ్ జువెలరీ లోన్ కంపెనీలో(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) ఈ ఘటన జరిగింది. దొంగతనం జరిగిన ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.. ఫెడరల్ బ్యాంక్ సబ్సిడరీ. అందులో పనిచేసే ఉద్యోగులే ఈ చోరీకి పాల్పడటం గమనార్హం.
ఇదీ జరిగింది.. మొత్తం ముగ్గురు వ్యక్తులు.. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చారు. సెక్యూరిటీ గార్డు, సిబ్బందిని కట్టివేసి రూ. 20 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. వారికి మత్తు ఇంజెక్షన్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్వయంగా దర్యాప్తులో భాగమయ్యారు. బ్యాంకులో పనిచేసేవారే దొంగతనం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉద్యోగి మురుగన్ చోరీ ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి: హోటల్‌కు పిలిచి మహిళపై అత్యాచారం చేసిన వ్యాపారి