పట్టుచీరలు నేస్తూ పొట్ట పోషించుకునే కుటుంబం వారిది. ఆ కుటుంబంపై ప్రకృతి పెను విధ్వంసం సృష్టించబోయింది. కానీ, ఆ ఇంటిపెద్ద సమయస్ఫూర్తి కారణంగా.. అదృష్టవశాత్తు ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు.. ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
అసలేం జరిగింది..?
ఈరోడ్ జిల్లాలోని(Tamil nadu erode news) అంతియూర్ ప్రాంతంలో నివసించే ఓ చేనేత కార్మికుడి(52) ఇల్లు... ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నానింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఒంటి గంటకు నేలపై పెచ్చులు ఊడిపడటాన్ని ఆ వ్యక్తి గమనించాడు. ఇల్లు కూలిపోయే ప్రమాదం(House collapse escape) ఉందని గ్రహించిన అతడు.. తన కుటుంబాన్ని అప్రమత్తం చేశాడు.
అతనితో సహా తన భార్య, ఇద్దరు కుమార్తెలు, అతని వృద్ధ తండ్రి... ఇంట్లో అందిన వస్తువులను పట్టుకుని, హుటాహుటిన ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఆ కుటుంబం గనుక అదే ఇంట్లో ఇంకాసేపు ఉన్నట్లైతే.. ఘోర విషాద వార్త వినాల్సి వచ్చేదని చెప్పారు.
ఈ ఘటన కారణంగా.. రూ.10 వేలు విలువ చేసే పట్టు చీరలు దెబ్బతిన్నాయని సదరు చేనేత కార్మికుడు చెప్పాడు. చీరలు నేసేందుకు దాచిపెట్టిన నూలు పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి: కర్తార్‌పుర్ వేదికగా.. 74 ఏళ్ల తర్వాత కలుసుకొని..