Helicopter crash victims body: తమిళనాడు కున్నూర్లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నాయక్ గుర్సేవక్ సింగ్ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పంజాబ్ తరన్ తారన్ జిల్లాలోని దోడె సోదియాన్ గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. సింగ్ మృతదేహానికి కుటుంబ సభ్యులు, స్థానికులు నివాళులు అర్పించారు. జవానును చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
![Martyr Gursewak Singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13884615_imh9.jpg)
![Martyr Gursewak Singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13884615_imh0.jpg)
Naik Jitendra Kumar death: ఇదే ప్రమాదంలో మరణించిన నాయక్ జితేంద్ర కుమార్ మృతదేహాన్ని సైతం సైనికాధికారులు మధ్యప్రదేశ్లోని ఆయన స్వగ్రామానికి తరలించారు. ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి జనం భారీగా తరలివచ్చారు.
![coonoor Helicopter crash victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13884615_img50.jpg)
![coonoor Helicopter crash victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13884615_imh70.jpg)
ఇదీ చదవండి:
Cds Bipin Rawat: గంగమ్మ ఒడికి రావత్ దంపతుల అస్థికలు
Bipin Rawat last speech: బిపిన్ రావత్ చివరి సందేశం.. ఏం మాట్లాడారంటే..?