Tamil Nadu Bus Accident Today : తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఉదయం 4 గంటలకు ఓ ప్రభుత్వ రవాణా బస్సు, ప్రైవేట్ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. చనిపోయినవారిలో రెండు వాహనాల డ్రైవర్‌లు కూడా ఉన్నారు. మరో 40 మందికి గాయాలు అయ్యాయి. రెండు వాహనాల ముందుభాగాలు తుక్కుతుక్కుగా మారాయి. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వాణియంబాడి ఆస్పత్రికి తరలించారు. అయితే, సహాయక చర్యల్లో భాగంగా ఘటనా స్థలానికి చేరుకున్న వాణియంబాడీ రూరల్ హెడ్ కానిస్టేబుల్ మురళి గుండెపోటుతో మరణించారు.
ఇదీ జరిగింది
Tamil Nadu Government Bus Accident : బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న ఓ ప్రభుత్వ బస్సు అదుపుతప్పి.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన చెట్టియప్పనూర్లో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సమీపంలోని వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం అందులో 27 మందిని వెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.
ఘటనా స్థలంలోనే ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు
Tamil Nadu Road Accident News Today : సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ పరీక్షల కోసం తరలించారు. రోడ్డుపై ఉన్న బస్సులను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఎమ్మెల్యే సెంథిల్ కుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్ భాస్కర పాండియన్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇలుమలై, ప్రైవేట్ బస్సు డ్రైవర్ మహ్మద్ నదీమ్, క్లీనర్ మహ్మాద్ బైరోస్, ఏపీ చిత్తూర్‌కు చెందిన అజిత్ కుమార్, చెన్నైకి చెందిన కృతిక, రాజ్‌గా గుర్తించారు.
సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆటో- ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం