ETV Bharat / bharat

ఏఎంఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఎప్రిల్​ 6న తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో అమ్మ మక్కళ్​ మున్నేట్ర కళగం పార్టీ 15 మందితో కూడిన తమ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. మజ్లిస్​ పార్టీ(ఏఐఎమ్​ఐఎమ్​)తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత దినకరన్​ ఇప్పటికే ప్రకటించారు.

Tamil Nadu Assembly polls: TTV Dhinakaran's AMMK releases first list of candidates
తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన దినకరన్​
author img

By

Published : Mar 10, 2021, 1:36 PM IST

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. 15మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు అమ్మ మక్కళ్​ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీ అధినేత దినకరన్. మాజీ ఎమ్మెల్యే పీ.పలనిప్పన్​, ఎమ్​.రంగస్వామి, జీ.సెంతమిళన్​, సీ.షణ్ముగవేలు, ఎన్​జీ పార్థిబాన్​లు ఆ జాబితాలో ఉన్న ప్రముఖులు.

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత ఓవైసీతో పొత్తుపెట్టుకుంటున్నట్లు దినకరన్​ సోమవారం ప్రకటించారు. అసదుద్దీన్​ పార్టీకి మూడు సీట్లు కేటాయించింది ఏఎంఎంకే. వానియంబడి, కృష్ణగిరి, శంకరపురం నియోజకవర్గాల్లో ఏఐఎంఐఎం బరిలో దిగనుంది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే 10-15 నియోజకవర్గాల్లో ఈ పొత్తు ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో 234 సీట్లకు ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చదవండి:తమిళనాట దినకరన్​తో ఓవైసీ​ పొత్తు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.