తమిళనాడు శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది అన్నాడీఎంకే. 171 నియోజకవర్గాల నుంచి పోటీ పడే వారి వివరాలను వెల్లడించింది.
అంతకుముందు ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది అన్నాడీఎంకే. ఇందులో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పేర్లు ఉన్నాయి. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి పోటీ చేయనున్నారు. బోడినాయకనూరు నుంచి బరిలో దిగనున్నారు పన్నీర్ సెల్వం.
రెండు జాబితాలు కలిపి మొత్తం 177 పేర్లును విడదల చేసింది అన్నాడీఎంకే. మిత్రపక్షాలైన పీఎంకేకు 23, భాజపాకు 20 స్థానాలు కేటాయించింది. ఇంకా 14 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.
ఏప్రిల్ 6న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలవడనున్నాయి.
ఇదీ చూడండి: తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటుతాం: షా