ETV Bharat / bharat

TAJ MAHAL: ప్రేమ సౌధంలో మళ్లీ సందడి షురూ - ప్రేమ సౌధం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో తాజ్​మహల్​ సహా.. చారిత్రక కట్టడాలు, పర్యటక ప్రదేశాలు బుధవారం తెరుకుచున్నాయి. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ పర్యటకులను అనుమతిస్తున్నారు. ప్రఖ్యాత కట్టడం తాజ్​మహల్​ వద్ద 60 రోజుల తర్వాత సందర్శకుల సందడి మొదలైంది.

Tajmahal
తాజ్​మహల్​
author img

By

Published : Jun 16, 2021, 10:50 AM IST

Updated : Jun 16, 2021, 11:06 AM IST

కరోనా మహమ్మారి కారణంగా 60 రోజులుగా మూతపడిన ప్రపంచ ప్రఖ్యాత కట్టడం.. తాజ్​మహల్​ తిరిగి తెరుచుకుంది. మళ్లీ సందర్శకుల సందడి మొదలైంది. కరోనా వైరస్​ తగ్గుముఖం పడుతున్న క్రమంలో పురావస్తు శాఖ పరిధిలోని అన్ని స్మారక కట్టడాలు, స్థలాలు, ప్రదర్శనశాలల్ని బుధవారం తెరిచారు.

tajmahal
సెల్ఫీ తీసుకుంటున్న బ్రెజిల్​ యువతి

ఒకసారి 650 మందికి మాత్రమే తాజ్​మహల్​ పరిసరాల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఇతర కట్టడాల విషయంలో ఇలాంటి నిబంధనలు లేవని వెల్లడించారు.

tajmahal
తాజ్​మహల్​ వద్ద సెల్ఫీ

తెల్లవారు జామునే...

తాజ్​మహల్​ వద్ద కొవిడ్​ నిబంధనలు పాటించేలా థర్మల్​ స్క్రీనింగ్​, శానిటైజేషన్​ వంటి అన్ని చర్యలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామునే బ్రెజిల్​కు చెందిన మెలిస్సా డలరోజా, ఘజియాబాద్​కు చెందిన ఓ కుటుంబం ప్రేమ సౌధాన్ని చూసేందుకు వచ్చారు. తాజ్​మహల్​ను చూడాలని ముందుగానే ప్రణాళిక వేసుకున్నా.. లాక్​డౌన్​తో మూతపడటం వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఓ కుటుంబం తెలిపింది. లాక్​డౌన్​ తర్వాత తొలిరోజునే సందర్శించటం చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొంది.

Tajmahal
తాజ్​మహల్​ వద్ద శానిటైజేషన్​
tajmahal
ప్రవేశ మార్గం వద్ద ఏర్పాట్లు

ఆన్​లైన్​ ద్వారానే..

కేవలం ఆన్​లైన్​ ద్వారానే టికెట్లు బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. సందర్శకులు కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎక్కడా కట్టడాలను తాకరాదని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. బుకింగ్​లన్నీ ఆయా రాష్ట్రాలు, విపత్తు నిర్వహణ యంత్రాగాలు జారీ చేసే ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు.

tajmahal
తాజ్​మహల్​ వద్ద సందర్శకుల సందడి

60 రోజులుగా..

కొవిడ్​ రెండో దశ ఉద్ధృతి కారణంగా ఏప్రిల్​ 16న తాజ్​మహల్​ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కట్టడాలు, సందర్శనాశాలల్ని మూసివేశారు. కరోనా తగ్గుతున్నందున 60 రోజుల తర్వాత తెరుచుకున్నాయి.

tajmahal
ప్రవేశ మార్గం వద్ద థర్మల్​ స్క్రీనింగ్​
tajmahal
తాజ్​మహల్​ వద్ద తనిఖీ చేస్తున్న సిబ్బంది

ఇదీ చూడండి: పెళ్లామే కావాలన్న పదహారేళ్ల బాలుడు

Last Updated : Jun 16, 2021, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.