రాజస్థాన్‌లోని పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఝున్ఝునూ జిల్లాలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఓ యువకునికి మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన 26 రోజుల్లోనే పోక్సో కోర్టు.. సదరు యువకున్ని దోషిగా తేల్చింది. ఇది దారుణమైన నేరమన్న కోర్టు.. దోషి మరణశిక్షకు అర్హుడని వ్యాఖ్యానించింది.
ఇదీ జరిగింది
తన ఇంటి సమీపంలోని పొలంలో ఆడుకుంటున్న చిన్నారిని.. 21 ఏళ్ల సునీల్ కుమార్ అపహరించి, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.
వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. 10రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తీర్పును పోక్సో కోర్టు బుధవారం వెలువరించింది.
ఇదీ చూడండి: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం