swarga balcony makeovers : ఒంటరితనం మనిషికి చాలా అనుభవాలను రుచి చూపిస్తుంది. నాకేమో వ్యాపార పాఠాలను నేర్పించింది. పుట్టి పెరిగింది అంతా వరంగల్‌లోనే. పది ఫెయిల్, రెండు సంవత్సరాలు పట్టింది పాస్ అవ్వడానికి. తర్వాత ఇంకెముంది పెళ్లైంది. మా ఆయన లక్ష్మీనారయణ. నాకు 19 ఏళ్లకే పాప. మంచి భర్త.. కన్నకూతురు కన్నా బాగా చూసుకునే అత్తమామలు. గీసుకొండలో ఇన్సులేటర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఏ లోటూ లేదూ కాబట్టి ఏదైనా పనిచేయాలన్న ఆలోచన ఎప్పుడూ తట్టలేదు.
అన్ని అనుకున్న తానే వెళ్తా అంటే అర్థం కాలే : వంటిల్లే నాకు ప్రపంచంలా ఉండేది. కానీ ఏడేళ్ల క్రితం నా భర్త చనిపోయారు. తర్వాత అమ్మానాన్నల్నీ కోల్పోయా.. అది తట్టుకోవడం చాలా కష్టమైంది. ఇంకా మా అమ్మాయి చదువుకోసం హైదరాబాద్ వచ్చేశాం. ఇక్కడికి వచ్చాక అనిపించింది ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది అని. అప్పుడే సన్నిహితుల సలహా మేరకు స్కూల్ ఫ్రాంచైజీ తీసుకున్నా. చేయగలనని నమ్మకం వచ్చాకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నా. కానీ స్కూల్ నిర్వహణలో అనుకోని చాలా సవాళ్లు ఎదురయ్యాయి.
balcony makeovers hyderabad : అన్ని ఒక్కొక్కటిగా తెలుసుకున్నా. ఒక దారిలో పడుతుందన్న సమయానికి కరోనా వచ్చి అతలాకుతలం చేసింది. 2020లో బీటెక్ పూర్తయ్యాక పేస్ట్రీ బేకింగ్, మేకింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి అమెరికా వెళ్తా అంది మా అమ్మాయి. అయిన వారందరినీ పోగొట్టుకుని తనే ప్రపంచంగా బతుకుతున్న నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అలా అని నా స్వార్థం కోసం తన భవిష్యత్‌ను ఆపేయడం సరికాదనిపించి సరే అన్నాను.
swarga balcony makeovers founde Hemalatha : ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఏమీ తోచేది కాదు. అప్పుడే మొక్కల పెంపకంపై ధ్యాస పడింది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి మా బాల్కనీని అచ్చం అలానే తీర్చిదిద్దాలనుకున్నా. మేకోవర్స్కు సంబంధించిన ప్రతిదీ తెలుసుకున్నాను. మూడు నెలల తర్వాత మా బాల్కనీ స్వర్గంలా అనిపించింది. ఒక్కరు బాగుంది అని చెప్పినా చాలనుకున్నా. ఇరుగు, పొరుగువారంతా చూసి ఫిదా అయ్యారు. అప్పుడు అనిపించింది దీన్నే వ్యాపారంగా మార్చాలనీ. ఇంట్లో వాళ్లతో చెబితే ఎందుకమ్మా నీకు ఇవన్నీ హాయిగా ఉండకా అని అన్నారు. కొందరైతే బాల్కనీ మేకోవర్సా... ఏ వాళ్ల మొక్కలు వాళ్లు తెచ్చుకోలేరా..? కుండీల్లో మట్టి పోసి ఇవ్వడానికి నిన్ను సపరేట్గా నియమించుకుంటారా అంటూ హేళనగా మాట్లాడేవారు 2021లో " స్వర్గ బాల్కనీ మేకోవర్స్"ను ప్రారంభించాను. మరిది పిల్లల సాయంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు ఎలా చేయాలో నేర్చుకున్నా. రెండేళ్లలో రెండున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించాను.
లక్షల్లో ఆదాయం : నా మొదటి పెట్టుబడి రూ.50వేలు. ప్రస్తుతం నెలకు లక్షల్లో ఆదాయం వస్తోంది. బాల్కినీ మేకోవర్సే కాకుండా ఇంటీరియర్ డిజైనింగ్, పార్లర్స్, విల్లాలు. స్టూడియో వర్క్స్ మొదలైనవి చేస్తున్నా. 20మంది వరకు నా సంస్థలో పనిచేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చూసి నటి దివి తన స్టూడియోని డెకరేట్ చేయమని కోరింది. దాంతో నిహారిక కొణిదెల, శ్రీముఖి, మెహబూబ్‌ల స్టూడియోలు, ఇళ్లు డిజైన్ చేశా. నేను సొంతంగా నేర్చుకున్న దాన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ వేదికగా ఔత్సాహికులకు శిక్షణా ఇవ్వాలనే ఆశయంతో ముందుకు అడుగులు వేస్తున్నా.
ఇవీ చదవండి: