ETV Bharat / bharat

దీదీకి షాక్​- ఎమ్మెల్యే పదవికి సువేందు రాజీనామా

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్​ కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి.. శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Dec 16, 2020, 4:40 PM IST

ఊహాగానాలను నిజం చేస్తూ తృణమూల్​ కాంగ్రెస్​ కీలక నేత సువేందు అధికారి.. తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. విధానసభకు చేరుకున్న ఆయన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.

సువేందు గత నెలలోనే మమత కేబినెట్​ నుంచి తప్పుకున్నారు. అప్పటినుంచే ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కొద్దిరోజులుగా ఆయన తృణమూల్​ అధిష్ఠానానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

స్వాగతించిన భాజపా..

సువేందు నిర్ణయాన్ని బంగాల్​ భాజపా స్వాగతించింది. పార్టీలోకి ఆయనను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు భాజపా ఉపాధ్యక్షుడు ముకుల్​ రాయ్​.

భాజపాలోకి..

సువేందు అతి త్వరలోనే భాజపాలోకి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్లీలో డిసెంబర్​ 18న కేంద్ర హోం మంత్రి అమిత్​ షాను కలిసి పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. లేదా.. 19న బంగాల్​కు రానున్న షా సమక్షంలో భాజపాలో చేరతారని సమాచారం.

ఇదీ చూడండి: 18న షా సమక్షంలో కమలం గూటికి సువేందు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.