కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై(Flights Ban India) విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA Flights Ban). ఈ మేరకు అక్టోబర్ 31 వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది.
అయితే.. కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో అధికారుల అనుమతితో అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతించనున్నట్లు డీజీసీఏ(DGCA Flight News) స్పష్టం చేసింది.
గతేడాది మార్చి 23 నుంచి..
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను 2020 మార్చి 23 నుంచి నిలిపేసింది డీజీసీఏ. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను మాత్రం కొనసాగిస్తోంది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ మొదలైన 28 దేశాల మధ్య విమాన సర్వీసులు కొనసాగిస్తోంది భారత్. అయితే.. అంతర్జాతీయ కార్గో సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని డీజీసీఏ పేర్కొంది.
ఇదీ చదవండి: