శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్ల స్థావరంపై కొందరు ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. బుధవారం రెయిన్వారీ చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
ఓల్డ్‌సిటీలోని రెయిన్వారీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ఏర్పాటు చేసిన మొబైల్ సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపారు.