ETV Bharat / bharat

కాలికి 9 వేళ్లతో శిశువు జననం!

కర్ణాటకలోని హోసపేటలో వింత ఘటన జరిగింది. ఎడమకాలికి తొమ్మిదివేళ్లతో ఓ మగబిడ్డ(baby boy) జన్మించాడు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, నెలలు నిండిన అనంతరమే కాన్పు జరిగిందని వైద్యులు వెల్లడించారు.

కర్ణాటక హోసపేట వార్తలు, baby born with 9 fingers karnataka
ఆ శిశువు కాలికి 9 వేళ్లు!
author img

By

Published : May 27, 2021, 12:29 PM IST

కర్ణాటకలోని విజయనగర జిల్లా హోసపేట పట్టణం పటేల్​నగర్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఎడమకాలికి తొమ్మిది వేళ్లతో ఓ మగబిడ్డ(baby boy) జన్మించాడు. స్థానికంగా ఓ మహిళకు పురిటినొప్పులు రావడం వల్ల మంగళవారం రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుడు ఆమెకు శస్త్రచికిత్స జరిపి కాన్పు చేశారు.

కర్ణాటక హోసపేట వార్తలు, baby born with 9 fingers karnataka
ఎడమకాలికి 9 వేళ్లతో జన్మించిన శిశువు

ఆమెకు గతంలో ఇద్దరు బిడ్డలు కలిగి మృతిచెందారు. ప్రస్తుతం మూడో సంతానం. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, నెలలు నిండిన అనంతరమే కాన్పు జరిగిందని శస్త్రచికిత్స చేసిన వైద్యుడు బాలచంద్రన్ పేర్కొన్నారు. పసికందు(baby) తల్లిదండ్రులు కోరితే శస్త్రచికిత్స చేసి అదనపు వేళ్లను తొలగించవచ్చని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి : మాస్కు ధరించలేదని మేకులు దించారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.