ETV Bharat / bharat

నేతలపై కేసుల్ని తొలుత విచారించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు - public representatives pending criminal cases

ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్​ కేసుల్ని తొలుత విచారించాలని.. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అమికస్​ క్యూరీ, సీనియర్​ న్యాయవాది విజయ్ హన్సారియా అత్యుత్తమ ధర్మాసనానికి నివేదించారు.

supreme court recommendations
supreme court recommendations
author img

By

Published : Nov 15, 2022, 8:02 AM IST

Updated : Nov 15, 2022, 9:02 AM IST

ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి ప్రజాప్రతినిధులపై దాఖలైన పలు క్రిమినల్‌ కేసులు ఐదేళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా తాజాగా నివేదించారు. కాబట్టి కింది కోర్టుల్లో తొలుత వాటిని విచారించి.. ఆ తర్వాతే ఇతర కేసులను తీసుకొనేలా ఉత్తర్వులు జారీ చేయాలని సిఫార్సు చేశారు. ముందుగా సిటింగ్‌ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులపై కేసుల్లో వేగంగా విచారణ చేపట్టాలని కోరుతూ భాజపా నాయకుడు, న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీగా నియమించిన హన్సారియా తాజాగా న్యాయస్థానానికి కీలక సిఫార్సులతో 40 పేజీల నివేదికను సమర్పించారు. సీబీఐ, ఈడీ కేసుల పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటుచేయాలని అందులో సూచించారు. ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను తెలంగాణతోపాటు 9 హైకోర్టులు పంపలేదని ఆయన తెలిపారు. 16 హైకోర్టులు మాత్రమే వాటిని అందజేశాయని పేర్కొన్నారు.

కేసుల విచారణ వేగంగా జరగడానికి హన్సారియా సిఫార్సులివీ..

1. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారిస్తున్న కోర్టులు ముందుగా వాటిపైనే విచారణ కొనసాగించాలి. అవి పూర్తయిన తర్వాతే మిగతావాటిని విచారించాలి. సీఆర్‌పీసీ సెక్షన్‌-309 ప్రకారం రోజువారీగా ట్రయల్‌ నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన పని విభజనను సంబంధిత హైకోర్టు లేదా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జీలు 2 వారాల్లో పూర్తిచేయాలి.

2. అసాధారణ అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ వాయిదాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే- అందుకు కారణాలను
నమోదుచేయాలి.

3. వాయిదాలు పడకుండా ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ న్యాయవాదులు సహకరించాలి.

4. కేసుల విచారణ కోసం సంబంధిత జిల్లా సెషన్స్‌ జడ్జితో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రత్యేక కోర్టులో కనీసం ఇద్దరు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాలి. విచారణ వేగంగా జరగడానికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సహకరించకపోతే.. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోర్టు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలి. దానిపై నివేదిక కూడా కోరాలి.

5. ఒకవేళ నిందితులే ట్రయల్‌ జాప్యానికి కారణమైతే వారి బెయిలు రద్దు చేయాలి.

6. మరణశిక్ష లేదా ఏడేళ్లు, అంతకుమించి జైలుశిక్ష పడటానికి వీలున్న కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు తొలి ప్రాధాన్యమివ్వాలి.

7. సిటింగ్‌ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను తొలుత చేపట్టాలి.

8. ప్రత్యేక కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదికలను
లేబొరేటరీలు మొదటగా అందించాలి. పెండింగ్‌ నివేదికలు ఏమైనా ఉంటే నెల రోజుల్లోపు సమర్పించాలి.

9. కోర్టులు ఆదేశించిన రోజు నిందితులను హాజరుపరిచే బాధ్యతను సంబంధిత పోలీసుస్టేషన్‌ అధికారికి అప్పగించాలి. లేదంటే కోర్టులు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేయాలి. అలాగే సాక్షులకు సమన్లు జారీ చేసి కోర్టు ముందు హాజరయ్యేలా చూసే బాధ్యతలనూ ఎస్‌హెచ్‌ఓలకు అప్పగించాలి. నిందితులు, సాక్షులను కోర్టు ముందు హాజరుపరచడంలో విఫలమైతే కోర్టులు నివేదిక కోరాలి.

10. సాక్షుల విచారణ, నిందితుల హాజరుకు సాధ్యమైనంత వరకు కోర్టులు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి.

11. విట్‌నెస్‌ ప్రొటెక్షన్‌ స్కీం-2018ని కోర్టులు సాక్షులకు అందుబాటులోకి తీసుకురావాలి.

ఇవే సిఫార్సులను ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ కేసులకూ వర్తింపజేయాలి. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలి.

  • పెండింగ్‌లో ఉన్న ఈడీ, సీబీఐ కేసుల పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదంటే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేయాలి. ఇందులో ఈడీ డైరెక్టర్‌, సీబీఐ డైరెక్టర్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శులనుగానీ, వారు నియమించిన అధికారులనుగానీ నియమించాలి. జిల్లా జడ్జి స్థాయికి తగ్గని న్యాయాధికారిని కూడా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని స్పెషల్‌ కోర్టులో ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా 92 కేసులు ఉన్నాయని, అందులో 50 కేసులు 5 ఏళ్లకు పైబడినవేనని నివేదికలో తెలిపారు.
  • ఎంపీలు/ఎమ్మెల్యేలపై 121 సీబీఐ కేసులు ఉన్నాయని వెల్లడించారు. వాటిలో 51 మంది ఎమ్మెల్యేలు, 112 మంది ఎంపీలు నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీటిలో 58 కేసుల్లో జీవితఖైదు పడటానికి వీలున్నట్లు తెలిపారు. 45 కేసుల్లో ఇంకా అభియోగాలు నమోదుచేయలేదని వెల్లడించారు.
  • ఎంపీలకు వ్యతిరేకంగా 51 ఈడీ కేసులు, ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలపై 71 మనీలాండరింగ్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు

ఇవీ చదవండి : 'రాష్ట్రపతి ఓ స్వీట్ లేడీ'.. బంగాల్ మంత్రి వ్యాఖ్యలకు దీదీ క్షమాపణ

'ప్రభుత్వ స్పందనకు నిర్దిష్ట సమయం ఉండాలి'.. కొలీజియంపై మాజీ సీజేఐ లలిత్ కీలక వ్యాఖ్యలు

Last Updated : Nov 15, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.