Supreme Court Quashes Suspension: మహారాష్ట్రలో 12 మంది భాజపా శాసనసభ్యులపై ఉన్న సస్పెన్షన్ను రద్దు చేసింది సుప్రీం కోర్టు. ఈ సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని మహా వికాస్ అఘాడీ సర్కారుకు చీవాట్లు పెట్టింది జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం.
స్పీకర్ స్థానంలో ఉన్న ప్రిసైడింగ్ అధికారితో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ వీరిపై గతేడాది జులైలో 12 నెలల పాటు నిషేధం విధించింది మహారాష్ట్ర అసెంబ్లీ.
వివాదం ఇలా..
స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం సమాచారం సిద్ధం చేసేందుకు 2011 నాటికి జనాభా గణాంకాలను రాష్ట్ర బీసీ కమిషన్కు అందించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం తలెత్తింది. కొందరు భాజపా నేతలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అక్కడ ఉన్న ప్రిసైడింగ్ అధికారితో వాదనకు దిగారు. దీంతో 12 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది.
దీనిని సవాల్చేస్తూ భాజపా శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి: అసోం- అరుణాచల్ సరిహద్దులో కాల్పుల కలకలం