ETV Bharat / bharat

వలస కూలీల రిజిస్ట్రేషన్​పై సుప్రీం అసంతృప్తి - వలస కూలీలపై సుప్రీంకోర్టు

వలస కార్మికుల సమస్యల సుమోటో కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్రాల్లోని వలస కార్మికులు ఆత్మనిర్భర్​ భారత్​ ప్రయోజనాలు పొందుతున్నారో లేదో వివరించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని స్పష్టం చేసింది.

supreme court on migrant workers,వలస కూలీలపై సుప్రీంకోర్టు
వలస కూలీల సమస్యలపై సుప్రీంకోర్టు విచారణ
author img

By

Published : May 24, 2021, 12:19 PM IST

వలస కార్మికుల రిజిస్ట్రేషన్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పథకాలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ లేక లబ్ధిదారులకు అవి అందడం లేదని పేర్కొంది. గతేడాది రిజిస్ట్రేషన్ జరపాలని ఆదేశాలు ఇచ్చినా.. ప్రక్రియ నత్తనడకన జరుగుతోందని వ్యాఖ్యానించింది. వలస కూలీల సమస్యలపై సుమోటో కేసుపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ఆత్మనిర్భర్​ భారత్, జాతీయ ఆహార భద్రత చట్టం వలస కార్మికులకు వర్తింపుపై సుప్రీంకోర్టు ఆరా తీసింది. అన్ని రాష్ట్రాల్లోని వలస కార్మికులు ఆత్మనిర్భర్​ భారత్ ప్రయోజనాలు పొందుతున్నారో లేదో తెలపాలని ధర్మాసనం ప్రభుత్వాలను ఆదేశించింది. మహమ్మారి సంక్షోభంలో కార్మికులకు ఆహారం, రవాణా వంటి సదుపాయలు కల్పించాలని పేర్కొంది. సంఘటిత, అసంఘటిత కార్మికులందరి వివరాలు నమోదు చేయాలని పేర్కొంది. సరైన గుర్తింపు, నమోదు ఉంటేనే వలసకార్మికులకు లబ్ధి చేకూరుతుందని జస్టిస్ ఎంఆర్ షా స్పష్టం చేశారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు లిఖితపూర్వక ఆదేశాలు వెలువరిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : 'కేంద్రంతో మరోసారి చర్చలకు సిద్ధం.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.