రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దేశం- ఒకే రేషన్ పథకాన్ని జులై 31 వరకు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణిగేంత వరకు వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
"వలస కార్మికుల కోసం సామూహిక వంటశాలలను ఏర్పాటు చేయాలి. అసంఘటిత రంగాల్లోని కార్మికుల రిజిస్ట్రేషన్ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) సాయంతో జులై 31లోపు కేంద్రం ఓ పోర్టల్‌ను రూపొందించాలి."
-- సుప్రీంకోర్టు ధర్మాసనం
వలస కార్మికులకు కేంద్రం ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తుందో తెలపాలని కోరుతూ అంజలి భరద్వాజ్, హర్ష మందార్, జగ్దీప్ ఛోకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం విచారించింది.
ఇదీ చదవండి : నిర్లక్ష్యంతోనే మూడోదశ ప్రమాదం.. జాగ్రత్తలేవి?