ETV Bharat / bharat

'ఎన్‌డీఏ పరీక్షకు మహిళలను అనుమతించాల్సిందే'

ఎన్‌డీఏ పరీక్షకు మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షకు మహిళలను అనుమతించకపోవడం లింగ వివక్షేనని సుప్రీం ఆక్షేపించింది.

Supreme Court
ఎన్‌డీఏ పరీక్ష
author img

By

Published : Aug 18, 2021, 3:10 PM IST

నేషనల్ డిఫెన్స్​ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షకు మహిళలను అనుమతించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. పరీక్షకు మహిళలను అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

అయితే విధాన నిర్ణయం ప్రకారమే మహిళలను అనుమతించట్లేదని సైన్యం వివరించగా.. అది లింగ వివక్ష ఆధారిత విధాన నిర్ణయమేనని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది.

సెప్టెంబర్‌ 5న ఎన్‌డీఏ పరీక్ష జరగాల్సి ఉంది. కాగా, ప్రవేశాలు మాత్రం తుది తీర్పునకు లోబడి జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కేంద్రం, బంగాల్​కు నోటీసులు..

పెగసస్‌పై విచారణ కమిషన్‌ నియమించడంపై బంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు కేంద్రం నుంచి కూడా వివరణకు ఆదేశించింది. కాగా, ఈ వ్యవహారంపై విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.