Super Mom Tigress: మధ్యప్రదేశ్ పెంచ్ టైగర్ రిజర్వ్‌లో 29 పులిపిల్లలకు జన్మనిచ్చిన కాలర్ వాలీ అనే ఆడపులి మృతి చెందింది. పదిహేడేళ్ల వయస్సు కలిగిన ఈ పులి 'సూపర్ మామ్'గా పేరుగాంచింది.
"2008-2018 మధ్యకాలంలో 8 ప్రసవాల్లోనే 29 పులి పిల్లలకు జన్మనిచ్చి రికార్డ్ నెలకొల్పింది. మొదటిసారి మూడు పిల్లలకు జన్మనివ్వగా అవి బతకలేదు. చివరిసారిగా 2018లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. మొత్తంగా 29 పిల్లల్లో 25 బతకగలిగాయి. దీనిని 'టీ15' అని కూడా అంటారు."
- పెంచ్ టైగర్ రిజర్వ్ అధికారులు
Collarwali Tigress Died: 2008లోనే 'కాలర్ వాలీ'కి రేడియా కాలర్ వచ్చింది. ఆ తర్వాత అది పనిచేయకపోతే 2010లో మరోసారి ఇచ్చారు. అనంతరం 'కాలర్ వాలీ'గా దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందింది. పన్నాటైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య తగ్గిన కారణంగా.. ఈ 'సూపర్ మామ్'ను టీనేజ్‌లో ఒకసారి పెంచ్ నుంచి పన్నాకు తరలించారని అధికారులు తెలిపారు. ముసలితనంతో బలహీనంగా ఉన్న ఈ పులిని చివరిసారిగా జనవరి 14న పర్యటకులు చూసినట్లు తెలుస్తోంది.
526 పులులతో 2018లోనే మధ్యప్రదేశ్ పులుల రాష్ట్రంగా పేరొందింది.
ఇదీ చదవండి: దిగ్గజ కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూత