ETV Bharat / bharat

viveka case : అవినాష్ బెయిల్​ రద్దు పిటిషన్ 19కి వాయిదా.. సుప్రీంలో కేసును స్వయంగా వాదించిన సునీత - ys viveka murder case live updates today

వైఎస్ వివేకా హత్య కేసు
వైఎస్ వివేకా హత్య కేసు
author img

By

Published : Jun 13, 2023, 12:04 PM IST

Updated : Jun 13, 2023, 5:49 PM IST

11:55 June 13

సీబీఐ దర్యాప్తును పొడిగించే అధికారం ఈ కోర్టుకు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేసిన సుప్రీం

viveka murder case : తండ్రి హత్య కేసును స్వయంగా కూతురు వాదించాల్సిన పరిస్థితి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురైంది. వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంలో పోరాటం సాగిస్తున్న ఆయన కూతురు నర్రెడ్డి సునీత... ఇవాళ తన కేసును తానే వాదించారు. వేసవి సెలవుల్లో జూనియర్ న్యాయవాదులకు అవకాశం కల్పించాలన్న ధర్మాసనం నిర్ణయంతో ఆమె నేరుగా న్యాయపోరాటం సాగించారు. ఈ సందర్భంగా పలు అంశాలను సూటిగా ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఎ8 గా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్ ఆహసనుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోపు దర్యాప్తుకు సంబంధించిన అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి పిటిషనర్ సునీతకు అనుమతి ఇచ్చింది.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి గత నెల 31న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ని రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. ఈరోజు విచారణలో పిటిషనర్‌ సునీత రెడ్డి స్వయంగా వాదనలు విపించాల్సిన పరిస్థితి తలెత్తింది. వేసవి సెలవుల్లో జూనియర్ న్యాయవాదులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం సీనియర్ న్యాయవాదుల వాదనలు వినడానికి నిరాకరించడంతో ఈకేసులో పిటిషనర్ సునీత నర్రెడ్డి స్వయంగా వాదనలు వినిపించారు.

ఈ కేసులో తానే పిటిషనర్‌ అని... తన తండ్రిని హత్య చేశారని సునీత ధర్మాసనానికి తెలిపారు. దీనిపీ జస్టిస్ విక్రమ్​నాథ్ స్పందిస్తూ ఈ ఫైల్ మేం చదివాము.. వేసవి సెలవుల్లో ఈ పిటిషన్ దాఖలు చేయాల్సినంత అత్యవసరత ఏముందని ప్రశ్నించగా... ఈకేసులో దర్యాప్తు జూన్ 30 కల్లా పూర్తిచేయాలని, ఆలోపు ఛార్జిషీట్ దాఖలు చేయాలని గతంలో సీజేఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో చోటు చేసుకున్న విస్తృత కుట్రలో భాగస్వామి అయిన ఏ8గా ఉన్న అవినాష్‌ రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని, అయినా అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అవినాష్‌ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కోర్టు ముందుస్తు బెయిల్ ఇవ్వడం వల్ల ఆ పని చేయలేక పోయిందని వివరించారు. ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో తాను ధర్మాసనం దృష్టికి తేవాలనుకుంటున్నట్లు చెప్పారు.

అసలు ఈ కేసులో ఎందుకు జోక్యం చేసుకోవాలని అనుకుంటున్నారు అని జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా సునీతను ప్రశ్నిస్తూ.... నిందితుడిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోవాల్సింది సీబీఐ అని అన్నారు. విచారణకు అతని అవసరం ఉందని చెబుతూ సీబీఐ రాలేదు.. ఏది జరిగినా దర్యాప్తునకు సహకరించేలా ఉండాలి... ఇగో క్లాష్ అతన్ని కటకటాల వెనక్కు పంపాలనుకోవడం మంచిదికాదని వ్యాఖ్యానించారు. దీనికి సునీత ఈ కేసులో తాను బాధితురాలిని అని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా... సీనియర్లను వాదనలకు అనుమతించక పోవడం వల్ల మీరు వ్యక్తి గతంగా వాదనలు వినిపిస్తున్నారు, మీ న్యాయ పరిజ్ఞానం, వాదనలు సీనియర్ న్యాయవాది అంత సమర్థంగా ఉండకపోవచ్చు, అందువల్ల విచారణను జులైకి వాయిదా వేస్తామని, అప్పుడు మీ న్యాయవాది వచ్చి వాదనలు వినిపించొచ్చు.. అందువల్ల వేసవి సెలవుల అనంతరం తొలి రోజు తేదీ ఇస్తాము అప్పుడు వాదనలు వినిపించండి అని సూచించారు. అందుకు సునీత స్పందిస్తూ జూన్ 30 లోపు దర్యాప్తు పూర్తి కావాలని ఇది వరకు ఇదే కోర్టు చెప్పినందున ఈ పిటిషన్ వృథా అవుతుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

సునీతకు సహకరించడానికి వచ్చిన సీనియర్ న్యాయవాది లూథ్రా జోక్యం చేసుకుంటూ వాస్తవానికి ఏప్రిల్ చివరికల్లా పూర్తి కావాల్సిన కేసు దర్యాప్తు గడువును జూన్ 30కి సీజేఐ ధర్మాసనం పొడిగించిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారని చెప్పే ప్రయత్నం చేయగా... జస్టిస్ విక్రమ్నాథ్ జోక్యం చేసుకుంటూ మీరు వాదనలు వినిపిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ పట్ల వివక్ష చూపుతున్నామని మిగతా సీనియర్ న్యాయవాదులు మాపై దాడి చేస్తారని సున్నితంగా హెచ్చరించారు.

జస్టిస్‌ అసహనుద్దీన్ అమానుల్లా జోక్యం చేసుకుంటూ దర్యాప్తును జూన్ 30కల్లా పూర్తి చేయాలని ఇప్పటికే ఒక ధర్మాసనం ఇచ్చిన తీర్పులో మార్పు చేయడం మాకు ఇబ్బందికరం కాదా అని ప్రశ్నించగా... దీనిపై సీబీఐ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని సునీత ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు జస్టిస్ అమానుల్లా స్పందిస్తూ మేం నోటీసులు ఇచ్చిన తక్షణం చిత్రం మారుతుందని అన్నారు. అప్పుడు జస్టిస్ విక్రమ్​ నాథ్ జోక్యం చేసుకుంటూ నిందితుడు దర్యాప్తునకు సహకరించడం లేదు... అందువల్ల అతన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది, హైకోర్టు తీర్పు బాగా లేదని సీబీఐ ముందు కొచ్చి చెప్పనివ్వండని అన్నారు. అందుకే జులై 3న మీ తరఫున న్యాయవాది వాదిస్తారు అని చెబుతూ, సీబీఐ దర్యాప్తును పొడిగించే అధికారం ఈ కోర్టుకు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. తర్వాత సునీత తన వాదనలు కొనసాగిస్తూ ఇది వరకు హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చినప్పుడు సీజేఐ ధర్మాసనం వాటిని కొట్టేసిందని గుర్తు చేశారు.

గతంలో కూడా హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ... తానే సుప్రీంకోర్టుకు వచ్చినట్లు తెలిపారు. దానికి జస్టిస్ ఆహసనుద్దీన్ అమానుల్లా జోక్యం చేసుకుంటూ 'నిందితుడు మీ సోదరుడా' అని సునీతను ప్రశ్నించగా... అందుకు అవును, మా సెకెండ్ కజిన్ అని సమాధానమిచ్చారు. జస్టిస్ అమానుల్లా స్పందిస్తూ ఇందులో సాంకేతిక అంశాలు కూడా ఇమిడి ఉన్నందున న్యాయవాదుల సహాయం తీసుకోవడం మంచిదని ఆమెకు సూచించారు.

జస్టిస్ విక్రమ్‌నాథ్‌ జోక్యం చేసుకుంటూ ఈకేసును వచ్చే వారానికి వాయిదా వేస్తాం. అప్పుడు మీ వాదనలు కూడా వినొచ్చు మాకేమీ అభ్యంతరం లేదని సీనియర్ న్యాయవాది సిద్దార్ధలూధ్రాను ఉద్దేశించి అన్నారు. రేపో, ఎల్లుండికో వాయిదా వేయాలని లూథ్రా కోరగా... తాము ఈవారం సీనియర్ న్యాయవాదులను అనుమతించడం లేదని న్యాయమూర్తులు బదులు ఇవ్వగా... ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని సునీత కోరారు. అందుకు తాము ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి వాదనలకు మొగ్గు చూపడం లేదని జస్టిస్ విక్రమ్‌నాథ్‌ పేర్కొన్నారు. సునీత జోక్యం చేసుకుంటూ ఈకేసులో ప్రతివాది విచారణకు సహకరించడం లేదని సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొందని తెలిపింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత విచారణకు హాజరు కాలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి అనుమతి కోరగా ధర్మాసనం అంగీకరించించిద. కేసు విచారణను ఈనెల 19కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Last Updated : Jun 13, 2023, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.