NITI Aayog Vice Chairman: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ పదవి నుంచి వైదొలగిన నేపథ్యంలో కొత్త వీసీగా సుమన్ బేరీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కేంద్రం తనపై నమ్మకముంచి ఈ బాధ్యతలను అప్పగించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారత ఆర్థిక వృద్ధిలో నీతి ఆయోగ్ తనదైన పాత్ర పోషించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
![suman bery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15165421_bery.jpg)
వీసీగా బేరీ ఎంపికకు ముందు.. ఆయన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసర్చ్కు (ఎన్సీఏఈఆర్) డైరెక్టర్‌గా సేవలు అందించారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారుల మండలి, స్టాటిస్టికల్ కమిషన్, మానిటరీ పాలసీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాంకేతిక సలహాదారుల కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్‌కు కూడా బెరీ సేవలు అందించారు.
![suman bery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15165421_kwatra.jpg)
Foreign Secretary of India: సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ క్వాత్ర నూతన విదేశాంగ కార్యదర్శిగా ఆదివారం బాధ్యతలు అందుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. జనవరి 2020 నుంచి ఇప్పటివరకు నేపాల్‌లో భారత రాయబారిగా క్వాత్ర సేవలు అందించారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న హర్ష్ వర్ధన్ శ్రింగ్లా స్థానాన్ని వినయ్ క్వాత్ర భర్తీ చేశారు.
ఇదీ చూడండి : ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి