ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్ ప్రాంతంలో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై (Purvanchal Expressway route) మూడు యుద్ధవిమానాలు దిగాయి. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రహదారిని ప్రారంభించనున్న (Purvanchal Expressway inauguration date) నేపథ్యంలో.. ముందస్తు ట్రయల్స్‌లో భాగంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ అయ్యాయి. మిరాజ్ 2000, సుఖోయ్-30, ఏఎన్32 టర్బోప్రాప్ యుద్ధవిమానాలతో పాటు సీ-130 రవాణా విమానం సైతం రహదారిపై ఆదివారం దిగినట్లు తెలుస్తోంది.
లఖ్‌నవూను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఆరు లేన్ల ఈ ఎక్స్‌ప్రెస్ వే(Purvanchal Expressway route).. బారాబంకి, అమేఠీ, సుల్తాన్‌పుర్, అయోధ్య, అంబేడ్కర్ నగర్, ఆజంగఢ్, మౌ, గాజీపుర్ జిల్లాలను (Purvanchal Expressway route map 2021) కలుపుతుంది. రహదారిలో భాగంగా సుల్తాన్‌పుర్ వద్ద 3.2 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్ సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు.
వాహనదారులకు ప్రయోజనం కలిగేలా, ఇంధన వాడకం తగ్గేలా ఈ రహదారిని నిర్మించారు. భవిష్యత్‌లో దీన్ని ఎనిమిది వరుసల రహదారిగా మార్చుకోవచ్చు. రూ.22,500 కోట్ల వ్యయంతో రహదారిని పూర్తి చేశారు.
ఇదీ చదవండి: విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి- 1500 కిలోలు సీజ్