ETV Bharat / bharat

సుకేశ్​ నుంచి ఫెర్నాండెజ్​ అందుకున్న కానుకలు ఇవే! - ఖరీదైన కానుకలు

Sukesh Chandrashekhar case: రూ.200 కోట్ల మనీలాండరింగ్​ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్​ చంద్రశేఖర్​ నుంచి బాలీవుడ్​ నటి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ అందుకున్న కానుకలపై పలుమార్లు ప్రశ్నించింది ఈడీ. ఈ కానుకలపై చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ హీరోయిన్​ అందుకున్న కానుకల వివరాలను ఛార్జిషీట్లో పేర్కొంది దర్యాప్తు సంస్థ.

Sukesh Chandrashekhar case
సుకేశ్​ నుంచి ఫెర్నాండెజ్​ అందుకున్న కానుకలు
author img

By

Published : Dec 13, 2021, 4:10 PM IST

Sukesh Chandrashekhar case: మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ నటి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్​ చంద్రశేఖర్​ నుంచి ఖరీదైన కానుకలు తీసుకున్నారని తెలిసింది. అయితే, ఎలాంటి కానుకలు అందుకున్నారనే విషయంపై క్లారిటీ లేదు. ఈడీ ఛార్జిషీట్​ ప్రకారం.. ఫెర్నాండేజ్​ అందుకున్న కానుకలు కొన్ని బయటకు వచ్చాయి.

రూ.200 కోట్ల మనీలాండరింగ్​ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఫెర్నాండెజ్​ ఈ ఏడాది ఆగస్టు 30, అక్టోబర్​ 20న ఈడీ ముందు హాజరయ్యారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది దర్యాప్తు సంస్థ. ఆమె చెప్పిన వివరాలను ఛార్జిషీట్లో పేర్కొంది.

ఛార్జిషీట్​ ప్రకారం.. గూచీ, ఛానల్​ కంపెనీలకు చెందిన మూడు డిజైనర్​ బ్యాగులు, గుచీ సంస్థకు చెందిన 2 జిమ్​ షూట్లు ఉన్నాయి. అలాగే.. ఒక జత లూయిస్​ విట్టన్​ షూ, రెండు జతల డైమండ్​ చెవిపోగులు, మల్టీకలర్​ రాళ్ల బ్రాస్​లెట్​, రెండు హీర్మేస్​ బ్రాస్​లెట్​లు, ఒక మినీ కూపర్​ను కానుకలుగా అందుకున్నారు ఫెర్నాండెజ్​. మరోవైపు.. పలు సందర్భాల్లో చంద్రశేఖర్​ ప్రైవేట్​ జెట్​ ట్రిప్పులు సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఖరీదైన గుర్రం, పిల్లులపై వార్తలు..

సుకేశ్​ జైలులో ఉన్నప్పటికీ 2021 జనవరి నుంచి ఫోన్​ ద్వారా జాక్వెలిన్​తో మాట్లాడుతున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది ఈడీ. అతని నుంచి సుమారు రూ.10 కోట్లు విలువైన కానుకలు తీసుకున్నారన్న ఆరోపణలపై పలుమార్లు ప్రశ్నించింది. వాటిపై సరైన స్పందన రాలేదని పేర్కొంది. మరోవైపు.. చంద్రశేఖర్​ పంపిన కానుకల్లో రూ.52 లక్షల విలువైన గుర్రం, నాలుగు పర్షియన్​ పిల్లులు(ఒక్కోటి రూ.9 లక్షలు), ఖరీదైన చాక్లెట్లు, పూలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కేసు ఏమిటి?

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్​ చంద్రశేఖర్​. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్​ సన్నిహితుడు లీనా మరియా పాల్​ సహా.. బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను ఈడీ ప్రశ్నించింది. తిహాడ్​ జైలు నుంచే కాలర్​ ఐడీ స్పూఫింగ్​ ద్వారా జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను సుకేశ్​ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వర్గాలు తెలిపాయి. తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతన్ని జాక్వెలిన్​ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్​కు సంబంధించిన 20కిపైగా కాల్​ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్​ చంద్రశేఖర్​, లీనా పాల్​పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్​ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి: అతడి నుంచి గిఫ్ట్​గా ఖరీదైన పిల్లులు.. అందుకే ఆ నటికి ఇన్ని కష్టాలు!

బిజినెస్​మెన్​ భార్యలకు వల.. రూ.200 కోట్లకు టోకరా!

ఈడీ విచారణకు బాలీవుడ్​ నటి​- ఆ 50 ప్రశ్నలకు జవాబు దొరికేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.