ETV Bharat / bharat

'జాతీయ సంక్షోభంపై మౌనంగా ఉండలేం' - జాతీయ సంక్షోభం

దేశంలో కరోనా విజృంభణను 'జాతీయ సంక్షోభం'గా సుప్రీంకోర్టు అభివర్ణించింది. కొవిడ్‌ కట్టడి కోసం జాతీయ విధాన రూపకల్పన అంశంపై సుమోటోగా విచారణ చేపట్టడాన్ని సమర్థించుకుంది. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో విచారణ జరిపింది.

Centre to SC
సుప్రీంకోర్టు
author img

By

Published : Apr 28, 2021, 4:27 AM IST

దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతుండడాన్ని 'జాతీయ సంక్షోభం'గా పేర్కొన్న సుప్రీంకోర్టు.. తాజా పరిస్థితులను మౌన ప్రేక్షకునిగా చూస్తూ ఉండలేమని స్పష్టం చేసింది. కొవిడ్‌ కట్టడి కోసం జాతీయ విధాన రూపకల్పన అంశంపై సుమోటోగా విచారణ చేపట్టడాన్ని సమర్థించుకుంది. ఈ చర్యను వివిధ హైకోర్టుల్లో విచారణలో ఉన్న కరోనా సంబంధిత కేసులను గుప్పిట్లోకి తీసుకోవడంగా భావించరాదని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

హైకోర్టులే నిర్ణయాలు

కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ధర్మాసనం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో విచారణ జరిపింది. వివిధ హైకోర్టుల్లో కరోనా సంబంధిత కేసులు విచారణలో ఉన్న సమయంలో అదే అంశంపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టడాన్ని గత గురువారం కొందరు న్యాయవాదులు విమర్శించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమతమ ప్రాదేశిక పరిధుల్లోని అంశాలపై హైకోర్టులే నిర్ణయాలు తీసుకుంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

" ప్రాదేశిక పరిమితుల వల్ల హైకోర్టులకు ఇబ్బందులు ఏర్పడితే సహాయం చేస్తాం. మేం అంతరాన్ని పూరించే పాత్రను నిర్వహించదలిచాం. మాజోక్యాన్ని సరైన దృష్టితో అర్థంచేసుకోవాలి. ప్రాంతీయ పరిధులకు మించిన అంశాలూ కొన్ని ఉంటాయి. అప్పుడు సర్వోన్నత న్యాయస్థానం జోక్యం అవసరం ఏర్పడుతుంది."

-- సుప్రీంకోర్టు ధర్మాసనం

సుమోటో కేసులో అమికస్‌ క్యూరీగా సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్త, మీనాక్షి అరోరాలను సుప్రీంకోర్టు నియమించింది. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

యుద్ధప్రాతిపదికన చర్యలు: కేంద్రం

కరోనా రెండో దశ విజృంభణను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆక్సిజన్‌ కొరత నివారణకు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు 200 పేజీల అఫిడవిట్‌ను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ధర్మాసనానికి అందజేసింది. ఒకే టీకాకు భిన్నమైన ధరలను తయారీదారులు ప్రకటించడంలో హేతుబద్ధతను వివరించాలని ధర్మాసనం ఆదేశించింది.

మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు వేయనున్నట్లు ప్రకటించినందున టీకాలకు పెరిగే డిమాండ్‌ను ఎలా భర్తీ చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది.

ఇదీ చదవండి : '18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.