ETV Bharat / bharat

సుచిత్ర ఎల్లా, గోపిచంద్​కు 'ఎక్సలెన్స్'​ పురస్కారం - సుచిత్ర ఎల్లా

2020 'బిజినెస్ ఎక్సలెన్స్​ అవార్డు'ను సుచిత్ర ఎల్లా, పుల్లెల గోపిచంద్​కు ప్రదానం చేసింది ఆంధ్రా ఛాంబర్​ ఆఫ్ కామర్స్​(ఏసీసీ). వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డును అందిస్తారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి డీఆర్డీవో ఛైర్మన్ జి. సతీష్​ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

suchitra yella and pullela gopichand have got 2020 business excellency award
సుచిత్ర ఎల్లా, పుల్లెల గోపిచంద్​లకు బిజినెస్​ ఎక్సలెన్స్​ పురస్కారం
author img

By

Published : Feb 15, 2021, 7:01 AM IST

ఆంధ్రా ఛాంబర్​ ఆఫ్ కామర్స్​(ఏసీసీ) 2020 సంవత్సరానికి 'బిజినెస్ ఎక్సలెన్స్​ అవార్డు'లను ప్రదానం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమానికి సంస్థ అధ్యక్షురాలు డాక్టర్​ వీఎల్​ ఇందిరాదత్ స్వాగతం పలికారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

ఫార్మా రంగంలో హైదరాబాద్​లోని భారత్​ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్​ జాయింట్​ మేనేజింగ్ డైరెక్టర్​ సుచిత్ర ఎల్లా, అర్కిటెక్చర్​ రంగంలో ఆస్కార్​ అండ్ పొణ్ణి అసోసియోట్స్​కి చెందిన డాక్టర్ పొణ్ణి కాన్​సెస్సావో, గ్రామీణ విద్యాభివృద్ధికి కృషి చేసిన హైదరాబాద్​లోని సెంటర్​ ఫర్​ డెవలప్​మెంట్​ అండ్​ రిసెర్చ్​ డైరెక్టర్​ వీఎంఎం ప్రసాద్​, క్రీడా రంగానికి అందించిన సేవలకుగాను పుల్లెల గోపిచంద్​, ఎంఎస్​ఎంఈ రంగానికి చెందిన పుణెలోని శివార్​ నేచురల్స్​ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో వినాయక్ సి. హెగన పురస్కారాలు అందుకున్నారు. డీఆర్డీవో ఛైర్మన్ జి. సతీష్​ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ ఉపాధ్యక్షుడు సి. నాగేంద్ర ప్రసాద్​ వందన సమర్పణ చేశారు.

ఇదీ చదవండి : మితిమీరిన తాగుడుతో డీఎన్‌ఏలో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.