ETV Bharat / bharat

తండ్రిని పోలీసులు కొట్టారని కోపం.. న్యాయం కోసం జడ్జిగా మారిన యువకుడు - bihar youth became judge

తన కళ్ల ముందే తన తండ్రిని పోలీసులు కొట్టారు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి ఆ నాలుగేళ్ల చిన్నారిది. ఆ సమయంలో తండ్రి చెప్పిన మాటలు అతడి మదిలో బలంగా నాటుకుపోయాయి. దాంతో అందరికీ న్యాయం చేయాలనుకున్నాడు. న్యాయమూర్తిగా ఎదిగాడు.

Chhola Bhatura seller son became judge in Saharsa

author img

By

Published : Nov 20, 2022, 11:09 AM IST

ఉన్న ఊరిని సొంత ఇంటిని వదిలి పొట్ట కూటి కోసం ఆ కుటుంబం వలస వెళ్లింది. తండ్రి చోలే బటూరే.. చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ సమయంలో జరిగిన ఓ ఘటన ఆ చిన్నారిని ఇప్పడు న్యాయమూర్తిని చేసింది. ఇది బిహార్​ నుంచి దిల్లీకి వలన వెళ్లిన కమలేశ్​ విజయగాథ. తన కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ అడ్డుకోలేకపోయానే అని చిన్నబోయిన ఆ బాలుడి మనసులో మెదిలిన ఆలోచనే అతడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.

పొట్ట కూటి కోసం దిల్లీకి వలస...
అది బిహార్​లోని మారుమూల ప్రాంతం. 1992వ సంవత్సరం. సహ్రాసా అనే ఊరిలో ఉన్న ఓ కుటుంబం దిల్లీకి వలస వెళ్లి అక్కడ ఓ చిన్న పూరింట్లో తమ ఆవాసాన్ని ఏర్పరుచుకుంది. పొట్ట కూటి కోసం ఆ ఇంటి పెద్ద చోలే బటూరే.. దుకాణాన్ని నడిపేవాడు. తండ్రికి చేదోడుగా అదే దుకాణంలో నాలుగేళ్ల కమలేశ్​ పని చేసేవాడు.

Chhola Bhatura seller son became judge in Saharsa
కమలేశ్, ఆయన తండ్రి చోలే బటూరే

ఆ ఒక్క ఘటనతో..
ఎర్రకోట వెనకాల ఉన్న గుడిసెలన్నింటిని ఖాళీ చేయించాలని వచ్చిన పోలీసులతో కమలేశ్​ తండ్రికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఆయనపై ఓ పోలీసు చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిన్నారి కమలేశ్​కు పట్టలేనంత కోపం వచ్చినప్పటికీ తను ఏమి చేయలేకపోయాడు. పోలీసుల కంటే జడ్జిలే గొప్పవారు అని ఆ సమయంలో తండ్రి అన్న మాటలు తన మనసులో బలంగా నాటుకుపోయాయి. అప్పుడే తాను జడ్జీ అవుదామని నిర్ణయించుకున్నాడు.

లా సెట్​లో 64వ ర్యాంక్​..
కానీ తన కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ కల నెరవేర్చడం అంత సులువు కాలేదు. ఎంతో కష్టపడినప్పటికీ ఎన్నోమార్లు అతనికి నిరాశే మిగిలింది. అయినపట్టికీ వెనకడుగు వేయలేదు కమలేశ్​. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో, తండ్రి సహకారంతో మెరుగ్గా సన్నద్ధమయ్యాడు. బిహార్​లో న్యాయమూర్తుల నియామకం కోసం నిర్వహించిన 'జ్యుడిషియల్ సర్వీస్' పరీక్షలో 64వ ర్యాంక్​ సాధించాడు. దీంతో కమలేశ్​ కుటుంబసభ్యులతో పాటు సహ్రాసా గ్రామస్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

"కమలేశ్​ జడ్జి అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ల కుటుంబసభ్యుల పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. చోలే బటూరే దుకాణం నడుపుతూనే తన కొడుకును ఇంతటి వాడిని చేశాడు ఆ తండ్రి. కమలేశ్​ జడ్జి అయ్యి గ్రామం పేరు నిలబెట్టాడు."
-తేజ్​ నారాయణ్​ యాదవ్​,​ గ్రామస్థుడు

ఇదీ చదవండి:

19ఏళ్ల మోడల్​పై దారుణం.. కారులో నగరమంతా తిప్పుతూ గ్యాంగ్​రేప్

రసవత్తరంగా గుజరాత్​ ఎన్నికలు.. మోదీ వ్యూహం ఫలించేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.