దిల్లీలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ప్రారంభం (schools reopening in delhi) కానున్నాయి. 9-11 తరగతులు, కళాశాలలు, కోచింక్ కేంద్రాలను తెరిచేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే అంశంపై దిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు.
పాఠశాలలకు రావాలని.. విద్యార్థులను బలవంతపెట్టొద్దని సూచించారు. తల్లిదండ్రుల అనుమతితోనే.. విద్యార్థులు స్కూళ్లకు రావాలన్నారు.
" పాఠశాలల్లో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. స్కూల్కు రావాలని ఏ విద్యార్థినీ బలవంతపెట్టొద్దు. విద్యార్థులు పాఠశాలకు రావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. ఒక వేళ తల్లిదండ్రులు అంగీకరించకుంటే.. విద్యార్థులను బలవంతపెట్టొద్దు. వారిని ఆబ్సెంట్గా పరిగణించొద్దు."
- మనీశ్ సిసోడియా, దిల్లీ విద్యాశాఖ మంత్రి
దిల్లీ ప్రభుత్వం పాఠశాలలు తెరవటంపై తల్లిదండ్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో కరోనా మూడో ముప్పు నేపథ్యంలో.. కొంతమంది ఆందోళన చెందుతుండగా.. మరికొందరు మాత్రం కరోనా సమయంలో విద్యార్థులు కోల్పోయిన విద్యను.. తిరిగి ప్రారంభించటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: covid vaccination: ఒక్కరోజులో కోటి డోసులు- భారత్ రికార్డు