ETV Bharat / bharat

సీనియర్​తో గొడవ.. స్కూల్​కు పిస్టల్​ తెచ్చిన విద్యార్థి.. అతన్ని చంపాలంటూ.. - ఉత్తారాఖండ్​ లేటెస్ట్​ అప్డేట్స్​

పాఠశాలలో సీనియర్​తో గొడవ పెట్టుకున్న ఓ జూనియర్​ తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో స్కూల్​కు పిస్టల్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే?

boy bring pistol to school in uttarakhand
boy bring pistol to school
author img

By

Published : Nov 5, 2022, 7:27 PM IST

పాఠశాలలో జరిగిన వాగ్వాదాన్ని మనసులో పెట్టుకున్న ఓ విద్యార్థి అతన్ని చంపేందుకు స్కెచ్​ వేశాడు. మరుసటి రోజు స్కూల్​కు ఏకంగా పిస్టల్​ను పట్టుకొచ్చి అందరిని హడలెత్తించాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లోని సిద్కూల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.
అసలేం జరిగింది:
రెండు రోజుల క్రితం సిడ్కూల్​ పోలిస్​ స్టేషన్​ పరిధిలోని ఓ స్కూల్​లో 12వ తరగతి విద్యార్థికి, పదో తరగతి విద్యార్థి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. దీంతో స్కూల్​ యాజమాన్యం వారిద్దరినీ పిలిచి సర్ది చెప్పారు.

అయితే తనకు జరిగిన అవమానాన్ని మరిచిపోలేని ఆ పదో తరగతి విద్యార్థి మరుసటి రోజు పాఠశాలకు ఏకంగా ఓ పిస్టల్​ను తెచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పిల్లాడ్ని మందలించిన టీచర్లు అతని వద్దనున్న పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: స్ట్రెచర్ లేక రోగిని చేతులపై ఎత్తుకెళ్లిన కుటుంబ సభ్యులు

ప్రజాస్వామ్య రక్షణలో వెనక్కి తగ్గేదే లే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.