దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీలోనూ కరోనా పంజా విసురుతోంది. బుధవారం.. ప్రేమ్ సింగ్ అనే విద్యార్థి క్వారంటైన్ సెల్లో ఉండగానే మృతి చెందాడు. అయితే.. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. కొవిడ్ సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అయినందున ప్రేమ్ సింగ్‌ను క్వారంటైన్లో ఉంచామని యాజమాన్యం పేర్కొంది.
ఐఐటీ రూర్కీలో.. ప్రేమ్ సింగ్ ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం క్వారంటైన్ సెల్లో అనుమానస్పదంగా పడి ఉన్న నేపథ్యంలో అతడ్ని రూర్కీ సివిల్ ఆసుపత్రికి తరలించారు యూనివర్సిటీ సిబ్బంది. అయితే.. అప్పటికే అతడు మృతిచెందినట్లు సివిల్ ఆసుపత్రి డాక్టర్లు స్పష్టం చేశారు. పోస్టుమార్టం తర్వాతే ప్రేమ్ మృతికి కారణమేంటో తెలుస్తుందని చెప్పారు.
మొత్తంగా ఐఐటీ రూర్కీలో 120 మంది విద్యార్థులకు కొవిడ్ సోకింది. వీరితో పాటు యాజమాన్యంలోనూ చాలా మంది వైరస్ బారినపడ్డారు.
ఇదీ చదవండి:కుంభమేళాలో 1,701 కరోనా కేసులు