ETV Bharat / bharat

బాలుడిని ఢీకొట్టిన బస్సు.. తలకు గాయంతోనే స్కూల్​కు విద్యార్థి.. స్పృహ తప్పి..

పాఠశాలకు వెళ్తున్న ఓ బాలుడిని.. బస్సు ఢీకొట్టింది. విద్యార్థి తలకు గాయాలయ్యాయి. అయినా పాఠశాలకు వెళ్లిపోయాడు ఆ చిన్నారి. కాసేపటికి స్పృహ తప్పిపడిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలో జరిగింది.

student dies in bus accident
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
author img

By

Published : Sep 15, 2022, 1:50 PM IST

బస్సు ఢీకొట్టినా ఓ విద్యార్థి పాఠశాలకు వెళ్లాడు. క్లాస్​రూమ్​లో కూర్చొన్నాడు. కాసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన ఉపాధ్యాయులు.. ఆస్పత్రికి తరలించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని మున్నెకొల్లు ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నితీశ్ కుమార్(7) అనే బాలుడు మున్నెకొల్లు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం 9 గంటలకు పాఠశాలకు నితీశ్ వస్తుండగా ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా బాలుడు పాఠశాలకు వెళ్లిపోయాడు. తరగతి గదిలో కూర్చున్నాడు. అయితే కాసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు.

వెంటనే ఉపాధ్యాయులు.. బాలుడిని పాఠశాల సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు నితీశ్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరణకు వచ్చారు.
రాజేష్, ప్రియ దంపతుల ఏకైక కుమారుడు నితీశ్. బాలుడి తల్లి.. ఓ ప్రైవేట్ కంపెనీలో హౌస్ కీపర్ కాగా, తండ్రి రోజుకూలీ. ఘటనాస్థలికి చేరుకున్న హెచ్ఏఎల్​ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీ చదవండి: చెట్టుకు వేలాడుతూ దళిత మైనర్ల మృతదేహాలు.. రేప్ చేసి హత్య.. దివ్యాంగురాలిపై దారుణం

సుప్రీం జడ్జిల రిటైర్మెంట్ వయసు 67ఏళ్లకు.. బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.