ETV Bharat / bharat

అమ్మ సెల్​ఫోన్ తీసేసుకుందని విద్యార్థిని ఆత్మహత్య - విద్యార్థిని ఆత్మహత్య

సెల్​ఫోన్​ను తన నుంచి దూరం చేశారని ఓ విద్యార్థిని (girl suicide news) ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన బంగాల్​లో జరిగింది.

girl suicide news
విద్యార్థిని బలవన్మరణం
author img

By

Published : Nov 18, 2021, 5:55 PM IST

బంగాల్​లో విషాదకర ఘటన జరిగింది. అమ్మ సెల్​ఫోన్​ తీసుకుందని (girl suicide news) ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

బంగాల్​ దక్షిణ 24 పరగణాల జిల్లా బజ్​బజ్​ మున్సిపాలిటీ పరిధిలోని బలూర్​ఘాట్​లో శుభాష్​ మండల్ భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. శుభాష్ స్థానికంగా జ్యూట్​ మిల్లులో పనిచేస్తుంటాడు. ఆయన భార్య రాన్​ మండల్ రోజువారీ కూలీ. ఇద్దరూ కలిసి ముగ్గురు పిల్లలను చదివించుకుంటున్నారు. కరోనా కారణంగా పిల్లలకు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించగా.. సెల్​ఫోన్​ కొనిచ్చారు. ఇన్నిరోజులూ ఆ మొబైల్ సాయంతోనే పిల్లలు తరగతులకు హాజరయ్యారు.

కేసుల తగ్గుముఖంతో రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో కూతురు దగ్గర ఫోన్​ తీసుకుంది రాన్ మండల్​. తట్టుకోలేకపోయిన కూతురు.. గురువారం ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో సీలింగ్​ ఫ్యాన్​కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆస్పత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

ఇదీ చదవండి:గిరిజన బాలిక అపహరణ.. ఆపై అత్యాచారం

'దెయ్యం భయంతో కానిస్టేబుల్​ ఆత్మహత్య- ఇంట్లో ఉరేసుకుని...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.