ETV Bharat / bharat

'వ్యక్తిగత లక్ష్యాల కంటే పార్టీ బలోపేతమే ముఖ్యం' - సోనియా గాంధీ

కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంతో పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేయాలని సోనియా గాంధీ సూచించారు. వ్యక్తిగత లక్షాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్​ఛార్జ్​లతో ప్రత్యేకంగా సమావేశమైన ఆమె.. భాజపా, ఆర్​ఎస్​ఎస్​పై సైద్ధాంతిక పోరాటానికి పిలుపునిచ్చారు.

Strengthening party must override 'personal ambitions': Sonia Gandhi
'వ్యక్తిగత లక్ష్యాల కంటే పార్టీ బలోపేతమే ముఖ్యం'
author img

By

Published : Oct 26, 2021, 5:30 PM IST

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి సాధించింది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్​ఛార్జ్​లతో దిల్లీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీలో నాయకుల మధ్య స్పష్టత, సఖ్యత కొరవడిందని ఈ సమావేశంలో సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత అజెండాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసమే కృషి చేయాలని తేల్చి చెప్పారు. అప్పుడే పార్టీకీ, నాయకులకు విజయం దక్కుతుందని స్పష్టం చేశారు.

ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం కోసం అనసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దేశంలోని కీలక సమస్యలపై సందేశాలు పార్టీలోని క్షేత్రస్థాయి నాయకులకు వెళ్లడం లేదని సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భాజపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్​ క్యాడర్​కు​ శిక్ష ఇచ్చే విషయంపై దృష్టి సారించాలన్నారు.

'మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కాపాడే ప్రక్రియ... తప్పుడు వార్తలకు దీటుగా బదులివ్వడంతోనే ప్రారంభమవుతుంది. భాజపా, ఆరెస్సెస్ చేసే దుష్ప్రచారాన్ని సైద్ధాంతికంగానే ఎదుర్కోవాలి. ఈ యుద్ధంలో గెలవాలంటే వారి ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టి.. వారి అబద్ధాలను ప్రజల ముందు ఎండగట్టాలి. అందుకు పార్టీలో క్రమశిక్షణ, ఐక్యమత్యం ఉండాలి' అని సమావేశంలో పాల్గొన్న నేతలకు సోనియా సూచించారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కి చెప్పారు. దేశంలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగ యువత, చిన్న మధ్య తరహా వ్యాపారులు, అణగారిన వర్గాల కోసం కాంగ్రెస్ పోరాటాన్ని రెట్టింపు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. దేశంలోని యువతీయవకులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా గళమెత్తాలనుకుంటున్నారని, వారికి వేదిక ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్​దేనని సోనియా చెప్పారు.

నవంబర్​ 1 నుంచి భారీగా సభ్యత్వ నమోదు

దేశవ్యాప్తంగా నవంబర్ 1నుంచి వచ్చే ఏడాది మార్చి 31వరకు పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా వెల్లడించారు. కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని లొంగదీసుకోవాలని చూస్తున్న కేంద్రంపై సైద్ధాంతిక పోరాటం చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి మూల, ప్రతి దిక్కు, ప్రతి గ్రామం, ప్రతి వాడ సహా సుదూర ప్రాంతాలకు కాంగ్రెస్​ను చేరవేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్​ఛార్జ్​లు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

దేశంలో భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్​ ధరలను నిరసిస్తూ నవంబర్ 14 నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. 'జన్ జాగరణ్ అభియాన్' పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించనుంది.

ఇదీ చదవండి: సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్​ చేస్తున్న వాంఖడే: మంత్రి మాలిక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.