వీధి కుక్కల దాడికి ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని హరీమ్పుర్లో జరిగింది. ఆ కుక్కల దాడికి ఇప్పటి వరకు ఎంతో మంది గాయాలు పాలవ్వగా ఈ చిన్నారి మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. హమీర్‌పుర్‌లో ఓ సఫాయి కార్మికురాలి కూతురు మలవిసర్జన కోసం ఇంటి వెనకకు వెళ్లింది. అదే సమయంలో ఆమెపైకి వీధికుక్కలు దాడి చేశాయి. బాలిక ప్రతిఘటించలేక పోయేసరికి అవి ఆమెను.. దూరం లాకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి.
చిన్నారి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వెళ్లారు. స్థానికులు సైతం చిన్నారిని కాపాడేందుకు పరుగులు పెట్టారు. అయితే, అప్పటికే ఆ వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
డ్రిల్లింగ్ మిషన్‌తో గాయపరిచిన టీచర్..
క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విచక్షణ కోల్పోయి అమానవీయంగా ప్రవర్తించాడు. 11 ఏళ్ల విద్యార్థిని డ్రిల్లింగ్ మిషన్‌తో గాయపరిచాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది.
కాన్పూర్‌కు చెందిన ఓ చిన్నారి ప్రేమ్‌నగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 24న స్కూల్లో పిల్లాడిని రెండో ఎక్కం చెప్పమన్నాడు టీచర్ అనుజ్. బాలుడు చెప్పకపోయేసరికి ఆగ్రహించిన టీచర్.. చిన్నారి అని చూడకుండా డ్రిల్లింగ్ మిషన్‌తో చేతిని గాయపరిచాడు. దీంతో తోటి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు. ఉపాధ్యాయుడు అనుజ్‌ను సస్పెండ్ చేశారు అధికారులు. పాఠాశాలలోని చిన్నారుల ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వచ్చింది. చదువు చెప్పించకుండా వారి చేత పనులు చేయిస్తున్నారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇనుప ఫ్యాక్టరీలో మేనేజర్ మృతి...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుడ్ జిల్లాలో ఇనమును కరిగించే బట్టీలో పడి ఆ ఫ్యాక్టరీ మేనేజర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు గాజియాబాద్‌లోని సిహానికి చెందిన అనురాగ్ త్యాగీగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు వారికి సర్ది చెప్పారు. బట్టీ కార్మికులను ప్రశ్నించారు.
టైన్ కిందకు దూకి బలవన్మరణం...
ఇంటర్ విద్యార్థి ట్రైన్ కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. ఘటనకు మందు ఆ యువకుడు తోటి విద్యార్థిని కోసం బహుమతి కొని ఆ తర్వాత మృతి చెందాడని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.
సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఠౌరాలో 12వ తరగతి చదువుతున్న మోహిత్ ఇస్లామ్ అనే విద్యార్థి గురువారం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరాడు. కానీ అతను స్కూల్‌కు వెళ్లకుండా స్నేహితుల వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించాడు. ఆ తర్వాత తన తోటి విద్యార్థిని కోసం గిఫ్ట్ కొని ఇంటికి వెళ్తానని స్నేహితులకు చెప్పి వెళ్లాడు. కానీ అతను ఇంటికి వెళ్లకుండా పట్టాల మీదకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.