Dog eats dead body: ఒడిశా సుందర్‌గఢ్ జిల్లా రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచిన శవాన్ని వీధికుక్క పీక్కుతింది. ఇది చూసిన మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
డిసెంబరు 9న రూర్కెలాలోని ఉదిత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనం ఢీకొని రాజేష్ జాదవ్ అనే వ్యక్తి మరణించాడు. అతని మృతదేహాన్ని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం కుటుంబీకులు పోలీసుల సమక్షంలో మార్చురీకి చేరుకున్నారు. అయితే, శవం ముఖాన్ని కుక్క తిన్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: