ETV Bharat / bharat

'రైతుల నిరసనను నీరుగార్చే చర్చలు ఆపాలి' - Union Agriculture ministry

రైతు ఆందోళనను నీరుగార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కేంద్రాన్ని కోరాయి కర్షక సంఘాలు. సాగు చట్టాలకు మద్దతు పలికే రైతులతో చర్చలు ఆపాలని కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాశాయి.

Stop holding parallel talks with other farmer bodies: Protesting farmer unions to govt
'రైతుల నిరసనను నీరుగార్చే చర్చలు ఆపాలి'
author img

By

Published : Dec 16, 2020, 1:00 PM IST

సాగు చట్టాలకు సానుకూలంగా ఉన్న రైతులతో చర్చలు ఆపాలని కేంద్రాన్ని కోరారు ఆందోళన చేస్తున్న అన్నదాతలు. ఈ మేరకు కర్షకుల తరఫున కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి వివేక్​ అగర్వాల్​కు లేఖ రాసింది సంయుక్త కిసాన్​ మోర్చా.

ఒకవైపు.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఆందోళన చేస్తుంటే.. మరోవైపు అన్నదాతల నిరసనలను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కేంద్రంపై ధ్వజమెత్తారు రైతు సంఘాల ప్రతినిధులు. కర్షకుల ఆందోళనలను దెబ్బతీసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు మోర్చా సభ్యుడు దర్శన్​ పాల్​. చట్టాలు సవరిస్తామన్న కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు.

ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ను కలిసిన ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన భారతీయ కిసాన్​ సంఘం.. కనీస మద్దతుకు సంబంధించి చట్టాల్లో సవరణకు సానుకూలంగా ఉన్నట్లు చెప్పింది. అలాగే జిల్లా స్థాయిలో నిరసనలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 21వ రోజు రైతుల నిరసనలు- చిల్లా సరిహద్దు దిగ్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.