ఈ ఏడాది శీతాకాలంలో చలి కారణంగా దేశప్రజలు వణికిపోతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సాధారణంగా కొందరు.. కర్రలకు మంట పెట్టి చలికాచుకుంటారు. ఇంకొందరు ఇళ్లల్లో హీటర్లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ దొంగ మాత్రం.. చలికాచుకునేందుకు.. తాను దొంగలించిన బైక్‌నే ఉపయోగించుకున్నాడు!
ఇదీ జరిగింది..
నాగ్‌పుర్‌లోని యశోధరా నగర్లో ఇటీవలి కాలంలో బైక్‌ల చోరీ కలకలం సృష్టించింది. తమ వాహనాలను దొంగలించారంటూ అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ ముఠాను గురించి తెలుసుకున్నారు. చోటా సర్ఫరాజ్‌తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా.. ఆ ముఠా 10 బైక్‌లను దొంగలించినట్టు తేలింది. వాటిల్లో.. 9 వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. 10వ బైక్ గురించి చోటా సర్ఫరాజ్‌ను ప్రశ్నించగా.. "చలి ఎక్కువగా ఉంటోంది. అందుకే చలి కాచుకునేందుకు ఆ బైక్‌కు నిప్పుపెట్టాను," అని సమాధానమిచ్చాడు.
ఇదీ చూడండి:- 5400 గులాబీలతో శాంటాక్లాజ్ సైకత శిల్పం