ప్రాణంగా ప్రేమించిన తన భార్య.. ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లినా ఇంట్లోనే ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రేమను చాటుకున్నారు కర్ణాటకకు చెందిన శివ చౌగలే.
![Statue Of True Love](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bgm-02-7-patnigagi-murthi-pratistana-byte-1-7201786_07112021121544_0711f_1636267544_939_0711newsroom_1636274095_202.jpg)
![Statue Of True Love](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bgm-02-7-patnigagi-murthi-pratistana-byte-1-7201786_07112021121544_0711f_1636267544_311_0711newsroom_1636274095_698.jpg)
కర్ణాటక, బెళగావికి చెందిన శివ చౌగలే, మైనాభాయ్ దంపతులు. వారికి ఓ కుమార్తె ఉంది. గతంలో బెళగావి కార్పొరేషన్లో సభ్యులుగా సేవలందించారు. ఈ ఏడాది మేలో శివ చౌగలేకు కొవిడ్ సోకింది. అదే సమయంలో నిమోనియాతో బాధపడుతున్న మైనాభాయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
![Statue Of True Love](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bgm-02-7-patnigagi-murthi-pratistana-byte-1-7201786_07112021121544_0711f_1636267544_407_0711newsroom_1636274095_941.jpg)
మైనాభాయ్ భౌతికంగా లేకపోయినా.. ఆమె ఇంట్లోనే ఉన్నారన్న అనుభూతిని కలిగించేందుకు విగ్రహాన్ని తయారుచేయించి, ఇంట్లోని మొదటి అంతస్తులో ప్రతిష్ఠించారు శివ. తెల్లని పట్టుచీర, బంగారు ఆభరణాలు ధరించి, చిరునవ్వుతో.. అచ్చం మనిషిని పోలిన విధంగా విగ్రహం ఉంది.
30 ఏళ్ల క్రితం మాకు పెళ్లైంది. ఇటీవల నా భార్య న్యూమోనియాతో మరణించింది. అదే సమయంలో నాకు కొవిడ్ వచ్చింది. ఆమెను మరచిపోలేక ఇంట్లోనే విగ్రహాన్ని పెట్టాలని అనుకున్నా. పూజారులను అడిగితే 6నెలలు ఆగి చేద్దాం అన్నారు. ఇప్పుడు ఆ కల పూర్తయింది. అంతేకాక మైనాభాయ్ పేరుతో ఆస్పత్రి, ఫౌండేషన్ నిర్మిస్తున్నాను.
-- శివ చౌగలే, మైలా భాయ్ భర్త
భార్యపై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకున్న శివ చౌగలేను స్థానికులు ప్రశంసించారు.
ఇదీ చూడండి: పాక్ గెలిచినందుకు భార్య ఖుష్.. పోలీసులకు భర్త ఫిర్యాదు