State Wise Covid Cases: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేరళలోనే కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఒక్కరోజే 54,537 కేసులు నమోదవగా.. వైరస్ ధాటికి మరో 352 మంది బలయ్యారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 58.81 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 52,786కు చేరింది.
కర్ణాటకలో రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 31,198 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,88,767కు చేరింది. పాజిటివిటీ రేటు 20.91 శాతానికి చేరింది. కాగా వైరస్ ధాటికి మరో 50 మంది మరణంచారు.
మహారాష్ట్రలో కొత్తగా 24,948 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 103 మంది చనిపోయారు. 45,648 మంది వైరస్‌ను జయిచారు. మరోవైపు రాష్ట్రంలో 110 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
దిల్లీలో కొత్తగా 4,044 కేసులు బయటపడ్డాయి. మరో 25 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 8.60 శాతానికి తగ్గింది.
మూడోదశ ప్రారంభమైన తర్వాత మహారాష్ట్ర ముంబయిలోని ధారావిలో 39 రోజుల అనంతరం సున్నా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబరు 20న సున్నా కేసులను నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ 43 యాక్టివ్ కేసులున్నాయి.
వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు..
రాష్ట్రం | కొత్త కేసులు | కొత్త మరణాలు |
కేరళ | 54,537 | 352 |
కర్ణాటక | 31,198 | 50 |
తమిళనాడు | 26,533 | 48 |
మహారాష్ట్ర | 24,948 | 103 |
ఆంధ్రప్రదేశ్ | 12,561 | 12 |
గుజరాత్ | 12,131 | 30 |
రాజస్థాన్ | 8,125 | 21 |
మధ్యప్రదేశ్ | 7,763 | 05 |
ఒడిశా | 5,057 | 10 |
హరియాణా | 4,630 | 19 |
జమ్ముకశ్మీర్ | 4,354 | 05 |
దిల్లీ | 4,044 | 25 |
ఛత్తీస్గడ్ | 3,919 | -- |
తెలంగాణ | 3,877 | 02 |
మిజోరం | 2,064 | 00 |
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక సూచనలు