Stampede in Tamil Nadu: తమిళనాడు, మదురైలోని చిథిరై ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది. శ్రీ కల్లాళగర్ సుందరరాజా పెరుమాళ్ స్వామి ఊరేగింపునకు భారీగా జనం తరలిరాగా.. తొక్కిసలాట జరిగింది. ఓ 90 ఏళ్ల వృద్ధుడు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారత ప్రఖ్యాత ఉత్సవాల్లో చిథిరై పండుగ ఒకటి. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 5న మొదలయ్యాయి. ఇందులో భాగంగా స్వామి కల్లాళగర్ సుందరరాజా పెరుమాళ్‌ను బంగారు గుర్రంపై ఊరేగింపుగా వైగాయి నదికి తీసుకెళ్లారు. ఈ శనివారం ఉదయం నదిలో నిమజ్జనం చేశారు. ఊరేగింపును తిలకించేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. స్వామి వారి ఊరేగింపులో ఒక్కసారిగా జనం పరుగులు పెట్టటం వల్ల తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.
-
#WATCH | Tamil Nadu: A huge crowd of devotees witness the entry of Lord Kallazhagar into the Vaigai River, for the unity & amity of the Saiva-Vaishnava, as part of the #MaduraiChithiraiFestival2022 festival, in Madurai pic.twitter.com/9zDL92LaOD
— ANI (@ANI) April 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Tamil Nadu: A huge crowd of devotees witness the entry of Lord Kallazhagar into the Vaigai River, for the unity & amity of the Saiva-Vaishnava, as part of the #MaduraiChithiraiFestival2022 festival, in Madurai pic.twitter.com/9zDL92LaOD
— ANI (@ANI) April 16, 2022#WATCH | Tamil Nadu: A huge crowd of devotees witness the entry of Lord Kallazhagar into the Vaigai River, for the unity & amity of the Saiva-Vaishnava, as part of the #MaduraiChithiraiFestival2022 festival, in Madurai pic.twitter.com/9zDL92LaOD
— ANI (@ANI) April 16, 2022
రూ.5 లక్షల పరిహరం: తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరికి తలో రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వ్యక్తికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలతో బయటపడిన మరో ఏడుగురికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: గజరాజుల పరుగు పందెం.. భారీగా తరలివచ్చిన జనం