తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తే రేషన్ కార్డులో కుటుంబ పెద్దగా పేర్కొన్న గృహిణులకు ప్రతి నెల రూ. వెయ్యి ఆర్థికసాయం చేస్తామని ఆ పార్టీ నాయకుడు స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు తిరుచ్చి జిల్లా సిరుగానూరులో పార్టీ బహిరంగ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. 'స్టాలిన్ 7 ఉరుదిమొళిగళ్'(స్టాలిన్ ఏడు వాగ్దానాలు)ను ప్రకటించారు.
మెరుగైన తాగునీటి సరఫరా, నీటి వృథా తగ్గింపు, హరిత విస్తీర్ణం 25శాతానికి పెంపు, రైతు దిగుబడుల పెంపునకు చర్యలు, అందరికీ ఉన్నత విద్య, ఉన్నత స్థాయి వైద్యం, సుందర మహానగరాల రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఏడాదికి 10 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.