Stalin On Sanatana Dharma BJP Reaction : సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) డిమాండ్ చేసింది. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆరోపించిన ఉదయనిధి స్టాలిన్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. సీఎం స్టాలిన్ కుమారుడు ఇలా మాట్లాడడం బాధగా అనిపించిందన్న ఆమె.. ఉదయనిధిని మంత్రివర్గం నుంచి తప్పించి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Udhayanidhi Stalin Statement Sanatana Dharma : సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా నేతృత్వంలోని బృందం.. తమిళనాడు భవన్‌లో నిరసన లేఖ సమర్పించింది. స్టాలిన్ వ్యాఖ్యలపై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తన వైఖరిని స్పష్టం చేయాలని సచ్‌దేవా డిమాండ్ చేశారు. స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే ఆ పార్టీ హిందూ వ్యతిరేకి అనే ప్రజల అభిప్రాయం మరింత దృఢం అవుతుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఓట్ల కోసం హిందూ మతానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పని చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. దీని వల్ల ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇండియా ఫ్రంట్ క్షమాపణ చెప్పాలి: రాజ్‌నాథ్
Udhayanidhi Stalin Rajnath Singh : సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌లో బీజేపీ పరివర్తన్ యాత్ర మూడో విడత ప్రారంభం సందర్భంగా జైసల్మేర్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ఇండియా ఫ్రంట్ నేతలు క్షమాపణలు చెప్పాలని, లేదంటే దేశం వారిని క్షమించదని రక్షణ మంత్రి అన్నారు.
-
#WATCH | Jaisalmer, Rajasthan: On Tamil Nadu Minister Udhayanidhi Stalin's 'Sanatana Dharma' remark, Defence Minister Rajnath Singh says, "... They are attacking Sanatana Dharma. DMK has attacked Sanatana Dharma and Congress is quiet on it. I want to ask CM Gehlot why he didn't… pic.twitter.com/5Uwrc8AuvX
— ANI (@ANI) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jaisalmer, Rajasthan: On Tamil Nadu Minister Udhayanidhi Stalin's 'Sanatana Dharma' remark, Defence Minister Rajnath Singh says, "... They are attacking Sanatana Dharma. DMK has attacked Sanatana Dharma and Congress is quiet on it. I want to ask CM Gehlot why he didn't… pic.twitter.com/5Uwrc8AuvX
— ANI (@ANI) September 4, 2023#WATCH | Jaisalmer, Rajasthan: On Tamil Nadu Minister Udhayanidhi Stalin's 'Sanatana Dharma' remark, Defence Minister Rajnath Singh says, "... They are attacking Sanatana Dharma. DMK has attacked Sanatana Dharma and Congress is quiet on it. I want to ask CM Gehlot why he didn't… pic.twitter.com/5Uwrc8AuvX
— ANI (@ANI) September 4, 2023
"వారు(డీఎంకే) సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. డీఎంకే సనాతన ధర్మంపై దాడి చేసినా కాంగ్రెస్ దానిపై నిశ్శబ్దంగానే ఉంది. ఈ వ్యాఖ్యలపై సీఎం గహ్లోత్ ఎందుకు స్పందించలేదు? సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే కూడా దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు? సనాతన ధర్మం గురించి వారు ఏమనుకుంటున్నారో ఎందుకు వెల్లడించడం లేదు? సనాతన ధర్మం వసుధైక కుటుంబం అనే సందేశాన్ని ఇస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా పరిగణిస్తుంది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు తాను చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఉందా? విపక్ష ఇండియా ఫ్రంట్ నేతలు దీనిపై క్షమాపణ చెప్పాలి. లేకపోతే దేశం వారిని క్షమించదు."
-రాజ్‌నాథ్‌సింగ్, రక్షణశాఖ మంత్రి
బీజేపీ సహా కేంద్రమంత్రుల విమర్శల జడివాన కురుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రతి వ్యక్తికి వాక్ స్వేచ్ఛ ఉంటుందని హస్తం పార్టీ గుర్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందన్న ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్.. తమది సర్వ ధర్మం సమభావ సిద్ధాంతమని తెలిపారు. సమాన హక్కులు ఇవ్వని మతం.. రోగం లాంటిదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎద్దేవా చేశారు. సమానత్వాన్ని ప్రోత్సహించని, మనిషిగా గౌరవం కల్పించని ఏ మతమైనా వ్యాధితో సమానమని ప్రియాంక్ అన్నారు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది సైతం ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతుగా నిలిచారు. బీజేపీవి నకిలీ ఆందోళనలని ఆమె విమర్శించారు. కులాలను పెంచి పోషించే సనాతన ధర్మాన్ని తొలగించాలని తాము కోరుకుంటున్నామని, కానీ ఈ కుల సోపానక్రమం కొనసాగాలని బీజేపీ కోరుకుంటుందని డీఎంకే నేత శరవణన్ అన్నాదురై అన్నారు.
కుల వివక్షనే వ్యతిరేకించా: ఉదయనిధి
అయితే, ఈ విషయంలో తాను వెనకడుగు వేసేది లేదని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. 'నేను దాని (సనాతన ధర్మం) గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడాను. నేను ఏదైతే చెప్పానో.. దాన్ని మళ్లీ చెప్పేందుకు సిద్ధమే. నేను అన్ని మతాల గురించి మాట్లాడాను. హిందువుల గురించే కాదు. కుల వివక్షను మాత్రమే నేను వ్యతిరేకించాను' అని పేర్కొన్నారు.
Mohammad Akbar Lone Centre : అసెంబ్లీలో పాక్‌కు జైకొట్టిన ఎమ్మెల్యే.. సుప్రీంకోర్టులో ఊహించని షాక్
'2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. 9ఏళ్ల పాలన వల్లే ఈ ప్రగతి ఫలాలు'