ETV Bharat / bharat

ఫరూక్‌ అబ్దుల్లా కేసు విచారించలేను: హైకోర్టు జడ్జి

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రిపై నమోదైన ఓ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఫరూక్​పై వేసిన పిటిషన్​పై విచారణ జరపలేనంటూ సదరు న్యాయమూర్తి ప్రకటించడం గమనార్హం. గతంలోనూ ఈ తరహా పిటిషన్లను విచారించడానికి నిరాకరించినట్లు గుర్తుచేశారు.

srinagar high court judge tells farooq case as 'not before me'
ఆస్తుల అటాచ్‌ కేసులో ఫరూఖ్‌ అబ్దుల్లా పిటిషన్‌..
author img

By

Published : Mar 6, 2021, 6:59 AM IST

Updated : Mar 6, 2021, 7:09 AM IST

హవాలా కేసులో తన ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా వేసిన పిటిషన్‌పై విచారణ జరపలేనంటూ జమ్ముకశ్మీర్‌ హైకోర్టులోని ఓ న్యాయమూర్తి తప్పుకున్నారు. గతంలోనూ ఈ తరహా పిటిషన్లను విచారించడానికి నిరాకరించినట్లు చెప్పారు.

ఆస్తుల అటాచ్..

తాజా పిటిషన్‌పై కొత్త జడ్జి సమక్షంలో విచారణ జరపడానికి వీలుగా ఈనెల 8కి వాయిదా వేశారు. ఫరూక్​‌ అబ్దుల్లా 2001-11 మధ్య కాలంలో జమ్ముకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు అనుకూలురైన కొందరికి సంఘంలో పదవులిచ్చారని, వారి సాయంతో బీసీసీఐ నిధులను దారి మళ్లించారని ఈడీ నివేదికలో పేర్కొంది. ఆ నిధులతో ఫరూక్​‌ కొన్నట్లు తెలుస్తున్న రూ.12 కోట్ల విలువైన ఆస్తులను గతేడాది డిసెంబరులో అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఈడీ చర్యలను వ్యతిరేకిస్తూ ఫరూక్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అది శుక్రవారం జస్టిస్‌ 'అలీ మొహమ్మద్‌ మాగ్రే' ముందు విచారణకు రాగా.. ఆయన నిరాకరిస్తూ వాయిదా వేశారు.

ఇదీ చదవండి: ఫరూక్​పై దేశద్రోహం కేసు నమోదుకు సుప్రీం నో

'నా ప్రజల హక్కులు పురనరుద్ధరించేవరకు చనిపోను'

భాజపాకే వ్యతిరేకం.. భారత్​కు కాదు: ఫరూక్​

Last Updated : Mar 6, 2021, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.