ETV Bharat / bharat

స్పుత్నిక్​-వి 10 రోజుల్లో భారత్​లోకి!

author img

By

Published : Apr 20, 2021, 2:09 PM IST

వచ్చే నెలలో భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకా ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రతి నెలా 50 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు రష్యాలో భారత రాయబారి బాల వెంకటేశ్‌ వర్మ వెల్లడించారు.

sputhnik-v
స్పత్నిక్​-వి

రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్‌-వి మరో పది రోజుల్లో భారత్‌లోకి రానుంది. వచ్చే నెలలో భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకా ఉత్పత్తిని ప్రారంభించి.. ప్రతి నెలా 50 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు రష్యాలో భారత రాయబారి బాల వెంకటేశ్‌ వర్మ వెల్లడించారు. ఈ నెల చివరిలోపు రష్యా నుంచి స్పుత్నిక్‌-వి డోసుల మొదటి దిగుమతి జరుగుతుందని.. మే నెలలో భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించి క్రమంగా పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిన్‌-వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కొద్ది రోజుల క్రితమే అనుమతించింది. డీసీజీఐ అనుమతితో వ్యాక్సిన్‌ దిగుమతికి మార్గం సుగుమమైనట్లు భారత్‌లో స్పుత్నిక్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోన్న డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ వెల్లడించింది.

రష్యన్‌ డైరెక్టర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న స్పుత్నిక్ టీకాను భారత్‌తో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు గతేడాది సెప్టెంబర్‌లోనే రెడ్డీస్‌ సంస్థతో ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు, మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన రెడ్డీస్‌ డీసీజీఐకి దరఖాస్తు చేసింది. వాటి ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది.

ఇదీ చదవండి: పడక లభించక కారులోనే కరోనా రోగి మృతి

ఇదీ చదవండి: 'కరోనా నియంత్రణకు సైన్యం సేవలు విస్తరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.