ETV Bharat / bharat

ప్రేమను ఒప్పుకోలేదని దారుణం, కారుతో ఢీకొట్టి చంపిన ఉన్మాది

తన ప్రేమను తిరస్కరించిందని ఓ యువతిని కారుతో ఢీకొట్టి చంపాడు యువకుడు. ఈ దారుణం కర్ణాటకలో జరిగింది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

hassan road accident
Etv Bharat
author img

By

Published : Aug 21, 2022, 1:14 PM IST

కర్ణాటక హసన్ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని యువతిని కారుతో ఢీకొట్టి చంపాడు ఓ యువకుడు . అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. నిందితుడు భరత్​ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు శరణ్య ఆగస్ట్ 3న ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి భరత్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. అనంతరం కారును అదుపు చేయలేక ఆటో, బస్సు, రెండు బైక్​లను సైతం ఢీకొట్టాడు. ఈ ఘటనలో శరణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆగస్టు 4న మరణించింది. శరణ్య.. హెంజగొండనహళ్లి గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమె బువనహళ్లిలోని భారతి అసోసియేట్స్ కంపెనీలో సూపర్​వైజర్​గా పనిచేస్తోంది. నిందితుడు భరత్.. బొమ్మనాయికనహళ్లికి చెందిన యువకుడు.

hassan road accident
కారు ఢీకొట్టడం వల్ల మరణించిన శరణ్య

నిందితుడు భరత్ కారును ఘటనా స్థలంలోనే వదిలి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది రోడ్డు ప్రమాదమా, కావాలనే యాక్సిడెంట్ ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆగస్టు 12న పోలీసులు భరత్‌ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో.. ఉద్దేశపూర్వకంగానే శరణ్యను కారుతో వెనుక నుంచి ఢీకొట్టినట్లు భరత్​ అంగీకరించాడు. "పదే పదే నిందితుడు భరత్​.. శరణ్యను ప్రేమ పేరుతో వేధించేవాడు. అతడి ప్రేమను ఆమె ఒప్పుకోకపోవడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డాడు" అని పోలీసులు తెలిపారు. భరత్ మైసూరు నుంచి కారును అద్దెకు తెచ్చాడని చెప్పారు.

hassan road accident
ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న కారు
hassan road accident
నిందితుడు భరత్

ఇవీ చదవండి: మద్యం స్కాంలో సిసోదియాకు లుక్​ఔట్​ నోటీసులు, సవాల్​ విసిరిన మంత్రి

పాము కాటుతో ఐదేళ్ల చిన్నారి మృతి, తల్లిని కాపాడబోయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.