ETV Bharat / bharat

స్పైస్​జెట్​పై సైబర్ దాడి.. నిలిచిపోయిన ఫ్లైట్స్​ - స్పైస్​జెట్​ రామ్సన్​వేర్​ దాడి

Spicejet ransomware attack: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​జెట్​ ఎయిర్​లైన్స్​పై రాన్సమ్​వేర్​ దాడి చేసింది. దీంతో విమాన ప్రయాణాలపై ప్రభావం పడింది.

Spicejet faces ransomware attack
Spicejet faces ransomware attack
author img

By

Published : May 25, 2022, 10:39 AM IST

Updated : May 25, 2022, 11:55 AM IST

Spicejet ransomware attack: స్పైస్​జెట్​ ఎయిర్​లైన్స్​పై రాన్సమ్​వేర్ దాడి జరిగింది. దీంతో విమాన రాకపోకలపై ప్రభావం పడి.. అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. వైరస్​ దాడి వల్లే ఉదయం నుంచి విమానాల రాకపోకలు తగ్గాయని అధికారులు తెలిపారు.

"మా సిస్టమ్​పై గత రాత్రి రామ్సన్​వేర్​తో దాడి చేశారు. దీంతో ప్రయాణాలపై ప్రభావం పడింది. మా ఐటీ బృందం పరిస్థితిని సరిచేసింది. విమానాలు సాధారణ స్థితిలో నడుస్తాయి" అని స్పైస్​జెట్​ ట్వీట్​ చేసింది.

మరోవైపు విమానాశ్రాయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన అధికారులు సర్వర్​ డౌన్​ సమస్య తలెత్తిందంటూ వారిని శాంతపరిచారు. ఉదయం బయలుదేరాల్సిన విమానం.. ఇప్పటికీ కదలలేదని, స్పైస్​జెట్​ సేవలు చాలా పేలవంగా ఉన్నాయంటూ సౌరభ్​ గోయల్​ అనే ప్రయాణికుడు ట్వీట్​ చేశాడు.

ఇదీ చదవండి: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు హతం

Last Updated : May 25, 2022, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.